ఆరోగ్యం బాలేదు, కోర్టుకు రాలేనని సాకులు.. పెళ్లిలో డ్యాన్సులు: ప్రజ్ఞా ఠాకూర్‌పై కాంగ్రెస్ సెటైర్లు

By Siva KodatiFirst Published Jul 9, 2021, 4:57 PM IST
Highlights

బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌పై కాంగ్రెస్ పార్టీ సెటైర్లు వేసింది. ఆమె కోర్టుకు హాజరవ్వాలంటే ఆరోగ్యం బాలేదని సాకులు చెబుతారని.. కానీ పెళ్లిళ్లలో మాత్రం డ్యాన్సులు ఇరదీస్తున్నారంటూ చురకలు వేసింది. ప్రస్తుతం  ప్రజ్ఞా డ్యాన్స్ వీడియోలు వైరల్ అవుతున్నాయి.

తరుచూ వివాదాలతో వార్తల్లో నిలిచే బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. అది కూడా డ్యాన్స్ చేసి.. అదేంటి డ్యాన్స్ చేస్తే వివాదం ఎందుకు అయ్యిందనేగా మీ డౌడ్. ఈ స్టోరీ చదివితే మీకే అర్థమవుతుంది. ప్రజ్ఞా ఠాకూర్ ఉత్సాహంగా బాస్కెట్‌బాల్ ఆడుతూ ఉన్న వీడియో ఇటీవల వైరల్ అయ్యింది. అలాగే  ఓ పెళ్లికి హాజరైన ఎంపీ ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న మరో వీడియో తాజాగా బయటకు వచ్చింది. ఈ వీడియోలపై ప్రతిపక్ష కాంగ్రెస్ స్పందిస్తూ.. అనారోగ్య కారణాలతో హాజరుకాలేనని కోర్టుకు చెబుతున్న ఎంపీ.. ఇలా డ్యాన్స్‌లు చేయడం, బాస్కెట్‌బాల్ ఆడటం ఏంటంటూ సెటైర్లు వేశారు.

దేశంలో సంచలనం సృష్టించిన మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆరోగ్యపరమైన సమస్యల కారణంగా ఎప్పుడూ వీల్‌ఛైర్‌లోనే కన్పించే ఆమె.. ఒక్కసారిగా బాస్కెట్‌బాల్ ఆడటం, డ్యాన్సులు చేయడంతో ప్రతిపక్షనేతలు  విస్మయం వ్యక్తం చేస్తున్నారు. భోపాల్‌లో జరిగిన ఓ వివాహ వేడుకలో పాల్గొన్న ప్రజ్ఞా ఠాకూర్.. పాదం కదుపుతూ అక్కడున్న వారిని డ్యాన్స్ చేయాలంటూ ఉత్సాహపరిచారు.

అనంతరం ప్రజ్ఞా ఠాకూర్ వచ్చి, ఆశీర్వదించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని పెళ్లికుమార్తెలు మీడియాతో చెప్పారు. రోజు కూలీ అయిన ఓ వధువు తండ్రి మాట్లాడుతూ.. ఎంపీ సహాయం చేసుండకపోతే కుమార్తెలకు పెళ్లిళ్లు జరిగేవి కావన్నారు. అనంతరం మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి నరేంద్ర సలుజా ఈ వీడియోలను తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసి కామెంట్ చేశారు. సోదరి ప్రగ్యా ఠాకూర్‌ బాస్కెట్‌ బాల్‌ ఆడటం చూసినపుడు.. ఎవరి సాయం లేకుండానే నడిచినపుడు... ఇదిగో ఇలా డాన్స్‌ చేసినపుడు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. నిజానికి.. మాలేగావ్‌ కేసు విచారణలో కోర్టు ముందు హాజరు కాకుండా ఉండేందుకు అనారోగ్యంగా ఉన్నట్లు నటించి, బెయిలు మీద బయటకు వస్తారంతే. కానీ, ఇలాంటి వేడుకల్లో తను ఎంతో ఉత్సాహంగా ఉంటారు. ఏదేమైనా ఆమెను ఇలా చూస్తుంటే, అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నట్లే అనిపిస్తోంది’’ అని సలూజ విమర్శలు గుప్పించారు


 

हमारी भोपाल की सांसद बहन प्रज्ञा ठाकुर को जब भी बास्केट बॉल खेलते हुए , बग़ैर सहारे के चलते हुए या इस तरह ख़ुशी से झूमते हुए देखते है तो बड़ी ख़ुशी होती है…? pic.twitter.com/MR01Gumnun

— Narendra Saluja (@NarendraSaluja)
click me!