మైనర్ బాలికపై ఐదేళ్లుగా అత్యాచారం.. గర్భం రావడంతో..!

Published : Jul 05, 2021, 09:06 AM IST
మైనర్ బాలికపై ఐదేళ్లుగా అత్యాచారం.. గర్భం రావడంతో..!

సారాంశం

 గత ఐదేళ్లుగా బాలికపై అత్యాచారానికి  పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దంటూ బెదిరించడం గమనార్హం.

దేశంలో రోజు రోజుకీ మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. పాలుదాగే పసిపిల్ల దగ్గర నుంచి... కాటికి కాళ్లు చాపిన ముసలి వారిని కూడా వదలడం లేదు. తాజాగా... ఓ ఘోరం వెలుగులోకి వచ్చింది. 15ఏళ్ల మైనర్ బాలికపై గత ఐదు సంవత్సరాలుగా.. ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా... అతని కారణంగా బాలిక ఇటీవల గర్భం దాల్చడం గమనార్హం. ఈ సంఘటన  చండీగడ్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్ లోని వారణాసికి చెందిన మైనర్ బాలిక.. పాటియాలాలోని తన కజిన్ ఇంట్లో ఉంటోంది. ఈ సమయంలో బాలికపై ఓ యువకుడు కన్నేశాడు. గత ఐదేళ్లుగా బాలికపై అత్యాచారానికి  పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దంటూ బెదిరించడం గమనార్హం.

ఈ విషయం  గురించి ఎవరికైనా సమాచారం ఇస్తే ఆమె తల్లిదండ్రులను హత్య చేస్తానని అతడు బెదిరించాడు. దీంతో ఈ విషయాన్ని ఇన్నేళ్లుగా ఆమె బయటకు చెప్పలేదు. అత్యాచారం  ఫలితంగా, మైనర్ అమ్మాయి గర్భవతి అయింది. జూన్ 12 న ఆమె రాజీంద్ర ఆసుపత్రిలో ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె  బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత.. ఈ నేరం గురించి ఆమె  తల్లిదండ్రులు తెలిసింది. భాదిత కుటంబం ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీలోని 376, 506 సెక్షన్లతో పాటుగా, పోక్సో చట్టంలోని సంబంధిత విభాగాల కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. 

PREV
click me!

Recommended Stories

జానకమ్మ జీవితం..ఓ చరిత్ర ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా? | Singer S. Janaki Biography | S Janaki Assets
గాన కోకిల జానకమ్మ చివరి మాటలు ఇవే | Singer S. Janaki No More | Singer S. Janaki Last Word