అక్రమ సంబంధం.. నిద్రపోతున్న భర్తను..!

Published : Jul 05, 2021, 07:59 AM ISTUpdated : Jul 05, 2021, 08:08 AM IST
అక్రమ సంబంధం.. నిద్రపోతున్న భర్తను..!

సారాంశం

అల్తాఫ్.. మండ్యలోని పీయూ కలేజీలో ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నాడు. వీరికి ముగ్గురు సంతానం. కాగా... ఇటీవల సైదా రిజ్వాన్ కి ఫేస్ బుక్ లో రహతుల్లా అనే ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు.

భర్తను కాదని మరో వ్యక్తితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుంది. అతనితో బంధానికి ఆమెకు భర్త అడ్డుగా అనిపించాడు. అంతే.. అడ్డుగా ఉన్న భర్తను అతి దారుణంగా హత్య చేసేసింది. అందుకు ఆమెకు ప్రియుడు పూర్తిగా సహకరించాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం మాండ్యలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గుత్తలు లేఔట్ ప్రాంతానికి చెందిన అల్తాఫ్ మెహది(54), తన భార్య సైదా రిజ్వాన్ తో కలిసి నివాసం ఉంటున్నాడు. అల్తాఫ్.. మండ్యలోని పీయూ కలేజీలో ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నాడు. వీరికి ముగ్గురు సంతానం. కాగా... ఇటీవల సైదా రిజ్వాన్ కి ఫేస్ బుక్ లో రహతుల్లా అనే ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు.

వీరిద్దరూ ఛాటింగ్ చేసుకున్నాడు. అతనికి కావాల్సిన డబ్బును కూడా సైదా రిజ్వాన్ ఇచ్చింది. ఆ డబ్బుతోనే అతను ఓ దుకాణం కూడా పెట్టుకున్నాడు. వారి వివాహేతర సంబంధం తెలుసుకున్న అల్తాఫ్‌ భార్యను తీవ్రంగా మందలించాడు. దీంతో ఎలాగైనా అతన్ని మట్టుబెట్టాలని ఇద్దరు పథకం వేశారు.  శుక్రవారం రాత్రి అందరూ పడుకున్న సమయంలో సైదా ప్రియున్ని పిలిపించుకుంది.

నిద్రపోతున్న అల్తాఫ్‌ను ఇద్దరు గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం అతను వెళ్లిపోగా తన భర్త గుండెపోటుతో మృతి చెందినట్లు అంత్యక్రియలు కూడా చేశారు. బంధువులు ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఇద్దరినీఅదుపులోకి తీసుకున్నారు.     

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?