కూతురు లాంటి కోడలిపై కన్నేసిన మామ..

Published : Jul 21, 2020, 08:41 AM IST
కూతురు లాంటి కోడలిపై కన్నేసిన మామ..

సారాంశం

వీరి వివాహం గత ఏడాది జరిగింది. జూన్ నెలలోనూ మళ్లీ మామ తనపై లైంగిక దాడికి యత్నించగగా తాను భర్తకు ఫిర్యాదు చేశానని, అయినా ఆయన పట్టించుకోలేదని కోడలు చెప్పింది.   

కూతురిలాగా కంటికి రెప్పలా కాపాడాల్పిన కోడలిపైనే కన్నేశాడు. ఎవరూ లేని సమయంలో కోడలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. లాక్ డౌన్ సమయంలో ఎక్కడికి వెళ్లలేని పరిస్థితిలో ఉన్న కోడలిపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన నోయిడా నగరంలో వెలుగుచూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. లాక్‌డౌన్ సమయంలో తనపై మామ లైంగిక దాడికి పాల్పడ్డాడని గ్రేటర్ నోయిడాలోని పూర్వాంచల్ హైట్స్ సొసైటీలో నివాసముంటున్న కోడలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీరి వివాహం గత ఏడాది జరిగింది. జూన్ నెలలోనూ మళ్లీ మామ తనపై లైంగిక దాడికి యత్నించగగా తాను భర్తకు ఫిర్యాదు చేశానని, అయినా ఆయన పట్టించుకోలేదని కోడలు చెప్పింది. 

మామ అత్యాచారం చేయడంతో కోడలు సెక్టార్ బేటా 2లోని తన పుట్టింటికి తిరిగివచ్చింది. దీనిపై కోడలి ఫిర్యాదుతో పోలీసులు ఐపీసీ సెక్షన్ 498 ఎ, 323, 504, 506, 342 354 376 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నోయిడా డీసీపీ బృందా శుక్లా చెప్పారు. 
 

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?