బస్సులో మహిళ ఎదుట.. హస్తప్రయోగం

Published : Nov 21, 2018, 03:07 PM IST
బస్సులో మహిళ ఎదుట.. హస్తప్రయోగం

సారాంశం

కదులుతున్న బస్సులో మహిళ ఎదురుగా ఓ యువకుడు హస్తప్రయోగం చేశాడు. 

కదులుతున్న బస్సులో మహిళ ఎదురుగా ఓ యువకుడు హస్తప్రయోగం చేశాడు. కాగా.. అతను చేసిన వికృతచర్యకు కంగారుపడిన యువతి.. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిని అరెస్టు చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన యువతి కాపషేడా నుంచి వసంత్ కుంజ్ ప్రాంతానికి బస్సులో ప్రయాణిస్తోంది. ఆమె సీటులో కూర్చొని ఉండగా.. ఆమె ఎదురుగా ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఆమెను చూస్తూ.. ఆమెకు తన జననాంగాన్ని చూపిస్తూ.. హస్తప్రయోగం చేశాడు.

అతి జుగుప్సాకరమైన ఆ సంఘటనను చూసి ఆ యువతి మొదట షాకైంది. వెంటనే అతనిపై అరిచింది కూడా. అయినప్పటికీ.. అతను ఆగకుండా తన పనిని కొనసాగించాడు. దీంతో.. చిర్రెత్తిపోయిన యువతి అతనిపై గట్టిగా అరిచేసింది. చేతిలో ఉన్న బ్యాగ్ తో చికతబాది.. అతనిని పోలీసులకు అప్పగించింది.

ఈ విషయంపై యువతి మాట్లాడుతూ...బస్సులో అతను అలా ప్రవర్తిస్తుంటే.. ఎవరూ నోరు మెదపలేదని ఆ యువతి ఆరోపించింది. తాను అతన్ని కొడుతున్నా కూడా ఎవరూ సహాయం చేయలేదని తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

ఇదేం చలిరా నాయనా..! చివరకు గోవులకు కూడా దుప్పట్లా..!!
Modi speech at the African Parliament:భారత్–ఇథియోపియా సంబంధాల్లో కొత్త అధ్యాయం | Asianet News Telugu