మరో వివాదంలో స్వామి నిత్యానంద, అరెస్ట్ కు రంగం సిద్ధం

Published : Nov 21, 2018, 01:52 PM ISTUpdated : Nov 21, 2018, 02:00 PM IST
మరో వివాదంలో స్వామి నిత్యానంద, అరెస్ట్ కు రంగం సిద్ధం

సారాంశం

తానే దేవుడును అంటూ స్వయంగా ప్రకటించికున్న ఆధ్యాత్మిక గురువు నిత్యానంద మరో వివాదంలో ఇరుక్కున్నారు. నిత్యం వివాదాల్లో ఉండే ఆయన ఇటీవలే గంజాయి వాడకంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో నిత్యానంద కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.  

బెంగళూరు: తానే దేవుడును అంటూ స్వయంగా ప్రకటించికున్న ఆధ్యాత్మిక గురువు నిత్యానంద మరో వివాదంలో ఇరుక్కున్నారు. నిత్యం వివాదాల్లో ఉండే ఆయన ఇటీవలే గంజాయి వాడకంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో నిత్యానంద కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

గంజాయి తీసుకోవాలని ప్రేరేపించే విధంగా నిత్యానంద వ్యాఖ్యలు చేశారు. గంజాయిపై నిత్యానంద చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పెద్ద దుమారాన్నే రేపాయి. దీంతో ఇటీవల సీసీబీ పోలీసులు నిత్యానందకు నోటీసులు జారీ చేశారు. సీసీబీ పోలీసుల నోటీసులకు నిత్యానంద స్పందించపోవడంతో కర్ణాటక పోలీసులు గాలింపు చర్యలకు దిగారు. 

బుధవారం ఉదయం నిత్యానంద ఆశ్రమానికి వెళ్లగా అక్కడ ఆయన లేకపోవడంతో పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయంతో ఆయన రాష్ట్రం విడిచి వెళ్లిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తమిళనాడులో నిత్యానంద తలదాచుకున్నట్లు తెలియడంతో పోలీసులు అక్కడికి ప్రత్యేక బృందాన్ని పంపించారు.  

ఈ వార్తలు కూడా చదవండి

ఆవులతో మాట్లాడిస్తానని చెప్పిన నిత్యానందపై మంచు మనోజ్ కామెంట్!

నా భార్య.. నిత్యానంద చెరలో ఉంది.. రక్షించండి

PREV
click me!

Recommended Stories

ఇదేం చలిరా నాయనా..! చివరకు గోవులకు కూడా దుప్పట్లా..!!
Modi speech at the African Parliament:భారత్–ఇథియోపియా సంబంధాల్లో కొత్త అధ్యాయం | Asianet News Telugu