అనుమానంతో భార్యను చంపి, ఆరు ముక్కలుగా చేసి, టేపుతో చుట్టేసి.. వాటర్ ట్యాంక్ లో దాచి పెట్టిన కసాయి భర్త..

Published : Mar 06, 2023, 12:52 PM IST
అనుమానంతో భార్యను చంపి, ఆరు ముక్కలుగా చేసి,  టేపుతో చుట్టేసి.. వాటర్ ట్యాంక్ లో దాచి పెట్టిన కసాయి భర్త..

సారాంశం

అనుమానంతో భార్యను అతి దారుణంగా చంపేశాడో కసాయి భర్త. ఆ తరువాత భార్య శరీరాన్ని ముక్కలుగా కోసం.. టేప్ చుట్టి ఇంట్లోని వాటర్ ట్యాంక్ లో దాచిపెట్టాడు.

చత్తీస్ గఢ్ : చత్తీస్గడ్ లో  ఒక  దారుణ ఘటన వెలుగు చూసింది.  అనుమానంతో ఒకసారి భర్త, భార్యను దారుణంగా చంపేయడమే కాకుండా హత్య తరువాత భార్య మృతదేహాన్ని టేపుతో చుట్టేసి.. ఇంట్లోనే వాటర్ ట్యాంక్ లో దాచి పెట్టాడు. ఈ ఘటన ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ నగరంలో వెలుగు చూసి కలకలం రేపింది. భార్యను చంపడానికి కారణం ఆమె మీద అతడికి అనుమానం కలగడమే. బిలాస్పూర్ చక్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉస్లాపూర్ దగ్గర ఈ ఘటన సంచలనం రేపింది. ఈ ఘటనలో మరో ట్విస్ట్ ఏంటంటే రెండు నెలల తర్వాత కానీ ఇది వెలుగులోకి రాకపోవడం.

ఘటన జరిగిన రెండు నెలల తర్వాత ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంలో ఇరుగుపొరుగు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  దీంతో వారు వచ్చి వెతకగా అసలు విషయం వెలుగు చూసింది.  ఫిర్యాదు అందుకున్న వెంటనే సదరు నిందితుడు ఇంటికి వచ్చిన పోలీసులు ఇల్లు మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. వాటర్ ట్యాంక్ లో సాతి సాహూ మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

విమానంలో మూత్ర విసర్జన కేసు : సోదరి పెళ్లి కోసం భారత్ కు వస్తూ తోటి ప్రమాణికుడిపై యూరినేట్..

 కాగా ఈ హత్య  వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాల నేపథ్యంలోనే జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతురాలి భర్త పవన్ సింగ్ ఠాకూర్ ని హత్యానేరం కింద అరెస్టు చేశారు. ఆ మహిళ మృతదేహం ఇంట్లోనే సింటెక్స్ ట్యాంక్ లో ఆరు ముక్కలుగా లభించింది.  అది చూసి షాక్ అయిన పోలీసులు వెంటనే భర్తని  అనుమానితుడిగా అరెస్టు చేసి అతడిని ప్రశ్నిస్తున్నారు.  అతని నుంచి హత్యకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.  బిలాస్పూర్ పోలీసులు దర్యాప్తు కూడా ప్రారంభించినట్లు  తెలిపారు.

ఇదిలా ఉండగా, వివాహేతర సంబంధాలతో జీవితాలను నాశనం చేసుకుంటున్న ఘటనలు అనేకం వెలుగు చూస్తున్నా.. వాటి మాయలో పడకుండా ఉండలేకపోతున్నారు. దీంతో నేరాల సంఖ్య పెరుగుతూనే ఉంది.. తెలిసీ.. చేసే ఈ తప్పులతో ఒకరు బాధితులుగా.. మరొకరు నేరస్తులుగా మారుతున్నారు. ఇలాంటి ఘటనే బీహార్ లో చోటు చేసుకుంది. వివాహిత అయిన ఓ మహిళ.. పక్కింటి యువకుడితో  వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయాన్ని గుట్టుగా ఉంచుతున్నానని అనుకుంది. భర్తతో సహా ఎవరికి తెలియదని  భావించింది. కానీ ఈ విషయం ఊర్లో వాళ్లకు తెలిసి వారి ద్వారా భర్తకు చేరింది.

దీంతో తట్టుకోలేని ఆగ్రహావేషాలతో ఆ భర్త దారుణమైన కృత్యానికి ఒడిగట్టాడు. భార్యను కొట్టి కొట్టి చంపేశాడు. బీహార్ లోని బంకాలో ఈ ఘటన సంచలన కేసుగా మారింది. సదరు మృతురాలి పేరు శిల్పాకుమారి. భర్త ఉండగానే పక్కింటి యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అది తెలిసిన భర్త సంజయ్ ఆమెను తీవ్రంగా కొట్టి చంపేశాడు. తన మేనల్లుడితో కలిసి.. శిల్పా కుమారి మృతదేహాన్ని  మాయం చేయాలని ప్రయత్నించాడు. అందుకోసం స్కూటీపై తీసుకువెళ్లాడు. అయితే ఈ విషయం ఎలాగో పోలీసులకు సమాచారం అందింది.

వెంటనే పోలీసులు సంజయ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసుల విచారణలో తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకోవడం వల్లనే హత్య చేసినట్లుగా నిందితుడు సంజయ్ ఒప్పుకున్నాడు. దీంతో  సంజయ్ మీద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. 
 

PREV
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu