
కుక్కల జనాభాను నియంత్రించడానికి మహారాష్ట్ర ప్రభుత్వానికి అచల్పూర్ స్వతంత్ర ఎమ్మెల్యే, ప్రహార్ జనశక్తి పార్టీ నాయకుడు ఓంప్రకాశ్ బాబారావ్ కడు చేసిన సూచన పలు విమర్శలకు గురవుతోంది. ఆయనపై జంతు ప్రేమికులు తీవ్రంగా మండిపడుతున్నారు. మహారాష్ట్ర నుంచి అన్ని వీధి కుక్కలను అస్సాంకు పంపాలని, ఎందుకంటే అక్కడ నివసించేరు కుక్క మాంసం తింటారని ఆయన అన్నారు. రాష్ట్రంలో కుక్కల జనాభాను ఎదుర్కోవటానికి ఇది ఆచరణీయమైన ఎంపిక అని అన్నారు.
విమానంలో మూత్ర విసర్జన కేసు : సోదరి పెళ్లి కోసం భారత్ కు వస్తూ తోటి ప్రమాణికుడిపై యూరినేట్..
మహారాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రతాప్ సర్నాయక్, అతుల్ భట్ఖల్కర్ లేవనెత్తిన వీధి కుక్కల బెడద అంశంపై జరిగిన చర్చకు సమాధానంగా కడు ఈ వ్యాఖ్యలు చేశారు. అక్కడి ప్రజలు కుక్క మాంసం తింటారు కాబట్టి రాష్ట్రం నుంచి అన్ని వీధి కుక్కలను అస్సాంకు పంపడం తెలివైన పని అని అన్నారు. అస్సాంలో కుక్కలను రూ.8,000-9,000కు విక్రయిస్తున్నారని, అక్కడి నుంచి వ్యాపారులను తీసుకొచ్చి వారితో ఒప్పందం కుదుర్చుకోవాలని సూచించారు.
సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు.. హోంశాఖ ఒత్తిళ్లతోనే ఏషియానెట్ న్యూస్ ఆఫీసులో సోదాలు
ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. జంతు ప్రేమికుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. ఈ విషయంలో వరల్డ్ ఫర్ యానిమల్స్ ఎన్జీవో వ్యవస్థాపకుడు తరోనిష్ బల్సారా మాట్లాడుతూ.. ఎమ్మెల్యే అనుచిత, వింత ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘జంతువుల కోసం ప్రభుత్వం చేస్తున్న మంచి పనికి విరుద్ధంగా ఉంటుంది. కుక్కలను చంపడం, వధించడం పూర్తిగా తప్పు’’ అని అన్నారు.
దారుణం.. వీధికుక్కలు వెంటపడడంతో బండిమీదినుంచి జారిపడి 55 యేళ్ళ మహిళ మృతి..
జంతు చట్టాల గురించి ప్రజలకు తెలియదని, కాబట్టి వారికి ముందుగా వీటిపై అవగాహన కల్పించాలని అన్నారు. ‘‘జనన నియంత్రణ అనేది చట్టబద్ధమైన, నైతిక మార్గం. కుక్కలకు స్టెరిలైజేషన్ చేయకపోవడం పెద్ద సమస్య... అస్సాంలో చట్టబద్ధత గురించి నాకు తెలియదు, కానీ మహారాష్ట్రలో కుక్కలను తరలించడం చట్టబద్ధం కాదు’’ అని బల్సారా అన్నారు.
తన తండ్రి పడకసుఖం తీర్చాలంటూ భార్యపై భర్త ఒత్తిడి..!
‘‘కుక్కలు మనుషులకు మాంసం కాదు. సహచర జంతువులు. వాస్తవానికి కుక్క మాంసం వివిధ హానికరమైన విషాన్ని కలిగి ఉంటుంది. వీధి కుక్కల జనాభాకు సహాయపడటానికి, జంతువుల జనన నియంత్రణ మాత్రమే నైతిక, ప్రభావవంతమైన పద్ధతి. దీనిని స్థానిక అధికారులు చాలా వ్యూహాత్మకంగా, నిర్మాణాత్మక పద్ధతిలో నిర్వహించాలి. అన్ని జంతువులకు గౌరవంగా జీవించే హక్కు ఉంది. ప్రపంచం శాకాహారం, నైతిక, సుస్థిర పద్ధతుల వైపు కదులుతున్న సమయంలో ఇది (ఎమ్మెల్యే ప్రకటన) అనవసరం’’ అని యూత్ ఆర్గనైజేషన్ ఇన్ డిఫెన్స్ ఆఫ్ యానిమల్స్ సహ వ్యవస్థాపకుడు మీనాల్ రాజ్దా అన్నారు.