
బ్రిటీష్ పాలన కంటే ముందే భారతదేశ జనాభాలో 70 శాతం మంది చదువుకున్నవారు ఉన్నారని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఆ సమయంలో నిరుద్యోగం ఉండేది కాదని అన్నారు. హర్యానాలోని ఇంద్రీ-కర్నాల్ రోడ్డులో ఓ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం అనంతరం జరిగిన సభలో ప్రసంగిస్తూ ఆరెస్సెస్ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘బ్రిటీష్ పాలనకు ముందు మన దేశ జనాభాలో 70 శాతం మంది విద్యావంతులు. నిరుద్యోగం ఉండేది కాదు. ఆ సమయంలో ఇంగ్లాండ్ లో కేవలం 17 శాతం మంది మాత్రమే చదువుకున్నారు’’ అని ఆయన అన్నారు. బ్రిటీషర్లు వారి విద్యావిధానాన్ని భారతదేశంలో అమలు చేశారని, మన విద్యా విధానాన్ని వారి దేశంలో అమలు చేశారని చెప్పారు. ఈ విధంగా వారు 70 శాతం విద్యావంతులయ్యారని, మనం 17 శాతం విద్యావంతులుగా మారామని ఆయన అన్నారు.
‘‘ మన విద్యావిధానం కేవలం ఉపాధి కోసమే కాదు. విజ్ఞాన మాధ్యమం కూడా. విద్య చౌకగా, అందరికీ అందుబాటులో ఉండేది. అందువల్ల సమాజం విద్య అన్ని ఖర్చులను తీసుకుంది. ఈ విద్య నుంచి బయటకు వచ్చిన పండితులు, కళాకారులు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు’’ అని ఆయన తెలిపారు.
విమానంలో మూత్ర విసర్జన కేసు : సోదరి పెళ్లి కోసం భారత్ కు వస్తూ తోటి ప్రమాణికుడిపై యూరినేట్..
సామాన్య ప్రజలకు ఆరోగ్య ప్రయోజనాలను అందించడానికి హాస్పిటల్ నిర్మించడంలో ఆత్మ మనోహర్ ముని ఆశ్రమం చేసిన పనిని భగవత్ ప్రశంసించారు. వైద్యం, విద్య రెండూ ఖరీదైనవిగా మారుతున్నందున అందరికీ ఆరోగ్యం, విద్య అత్యంత అవసరమని ఆయన అన్నారు. సామాన్యులకు తక్కువ ధరకు వైద్యం, విద్య అందుబాటులో ఉండేలా చూడాల్సిన అవసరం ఉందని మోహన్ భగవత్ అన్నారు.
సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు.. హోంశాఖ ఒత్తిళ్లతోనే ఏషియానెట్ న్యూస్ ఆఫీసులో సోదాలు
‘‘మనం మన కోసం మాత్రమే జీవించేవాళ్లం కాదు. మన సంస్కృతి, సంప్రదాయాల్లో సర్వజన్ హితే-సర్జన్ సుఖే (అందరి సంక్షేమం - అందరికీ సంతోషం) అనే భావన ఉంది. సమాజాన్ని బలోపేతం చేయడం ద్వారానే దేశంలో మంచి జరుగుతుంది’’ అని భగవత్ తెలిపారు.