భార్యపై అనుమానం.. నిద్రలో ఉండగా గ్యాస్ సిలిండర్ లీక్ చేసి, పెట్రోల్ చల్లి హత్య.. ఆ తరువాత...

Published : Nov 29, 2021, 10:23 AM IST
భార్యపై అనుమానం.. నిద్రలో ఉండగా గ్యాస్ సిలిండర్ లీక్ చేసి, పెట్రోల్ చల్లి హత్య.. ఆ తరువాత...

సారాంశం

20 ఏళ్ల క్రితం వీరికి వివాహం జరిగింది.  భార్యపై అనుమానం పెంచుకున్న నిస్సార్ తరచూ ఆమెతో గొడవ పడేవాడు. అనుమానం పెరిగిపోవడంతో భార్యను హత్య చేయడానికి పథకం వేశాడు. ఈనెల 19న ఆమె నిద్రలో ఉండగా సిలిండర్ ఆన్ చేసి పెట్రోల్ చల్లి పేలిపోయేలా చేశాడు.  దీంతో ఆమె ప్రమాదంలో చనిపోయిందని నమ్మించాడు.  

కర్ణాటక :  భార్యపై Illicit relationship అనుమానంతో ఓ శాడిస్ట్ భర్త ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఈ దుర్ఘటన ఇక్కడి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. పోలీసులకు ఆంధ్ర సరిహద్దుల్లో అతని dead body లభ్యమైంది.  వివరాల్లోకి వెళితే.. ఆడుగోడి రాజేంద్రనగర్లో నిసార్, ఆయేషా దంపతులు నివాసం ఉంటున్నారు.  

20 ఏళ్ల క్రితం వీరికి వివాహం జరిగింది.  భార్యపై అనుమానం పెంచుకున్న నిస్సార్ తరచూ ఆమెతో గొడవ పడేవాడు. అనుమానం పెరిగిపోవడంతో భార్యను murder చేయడానికి పథకం వేశాడు. ఈనెల 19న ఆమె నిద్రలో ఉండగా Gas Cylinder ఆన్ చేసి పెట్రోల్ చల్లి పేలిపోయేలా చేశాడు.  దీంతో ఆమె ప్రమాదంలో చనిపోయిందని నమ్మించాడు.  

అప్పటినుంచి  నిసార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో అతని సెల్ ఫోన్  ట్రేస్ చేయడంతో సరిహద్దు  అటవీ ప్రాంతంలో అతని మృతదేహం కనిపించింది.  Suicide చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా, పశ్చిమగోదావరి జిల్లాలో భార్య చీర కొనుక్కుందని కొట్టి చంపిన దారుణ ఘటన మూడు రోజుల క్రితం జరిగింది. అతను ప్రేమించానంటూ వెంటపడ్డాడు. భర్తగా మారాక అతనిని నమ్మి పెళ్లి చేసుకున్న ఆ యువతికి నరకం చూపించాడు. చివరకు అతనే కర్కశంగా హతమార్చాడు. చీర కొనుక్కుందన్న కోపంతో ఇటుక రాయితో తీవ్రంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలొదిలింది. ఈ ఘటన  west godavari districtలో జరిగింది.

నల్లజర్ల మండలం ప్రకాశరావు పాలేనికి చెందిన కళ్యాణం దుర్గా ప్రసాద్, పెంటపాడు మండలం రామచంద్రాపురానికి చెందిన దానమ్మ పెద్దలను ఎదిరించి love marriage చేసుకున్నారు. దానమ్మ తల్లిదండ్రులు బూరలు, రబ్బర్ బ్యాండ్లు, చెంపపిన్నులు.. వంటి సామగ్రి విక్రయిస్తూ జీవనం సాగించేవారు. దుర్గాప్రసాద్ కూడా అదే వృత్తి చేసేవాడు. 

Fastest Trial : ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం.. ఒక్కరోజులో తీర్పు ఇచ్చిన బీహార్ కోర్ట్..

తాగుడు, జూదానికి బానిసైన అతను ఇంటి బాధ్యత వదిలేశాడు. వీరికి ఒక కుమార్తె పుట్టింది. ఇల్లు కూడా గడవని పరిస్థితి ఏర్పడటంతో దానమ్మ తప్పనిసరి పరిస్థితుల్లో Begging చేసి భర్త, అత్త మామలను పోషించేది. alcoholకి బానిసైన దుర్గాప్రసాద్ ఆమె భిక్షాటన చేసి తీసుకొచ్చిన సొమ్ము కూడా లాక్కునేవాడు. దానమ్మ గర్భిణి అని చూడకుండా తీవ్రంగా కొట్టడంతో 20 రోజుల క్రితం ఆమెకు abortion అయ్యింది. 

ఇటీవల భర్తకు తెలియకుండా రూ.200తో చీర కొనుక్కుందని తెలిసి ఆమెతో బుధవారం రాత్రి తొమ్మిది నుంచి పదిగంటల మధ్య గొడవ జరిగింది. అత్త మరిడమ్మ కూడా అతనికి తోడైంది. ఈ గొడ పెరిగి పక్కనే ఉన్న Brickతో దానమ్మను తీవ్రంగా కొట్టాడు. బాధ తట్టుకోలేక ఆమె అరిచిన అరుపులకు రాత్రి పదిగంటల సమయంలో చుట్టుపక్కలవారు పోగయ్యారు. 

దెబ్బలకు దానమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారం అందించారు. దానమ్మ భర్త, అత్త కొట్టి చంపారని మృతురాలి తరఫు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాడేపల్లి గూడెం రూరల్ సీఐ రవికుమార్, నల్లజర్ల ఎస్ ఐ అవినాష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి అనుమానాస్పద మృతిగా గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu