పక్కింటి పురుషుడితో రాసలీలలు: భార్యను చంపేసిన భర్త

Published : May 01, 2021, 11:03 AM IST
పక్కింటి పురుషుడితో రాసలీలలు: భార్యను చంపేసిన భర్త

సారాంశం

పక్కింటి పురుషుడితో సన్నిహితంగా ఉండడాన్ని చూసిన ఓ వ్యక్తి తన భార్యను అంతం చేశాడు. ఈ సంఘటన కర్ణాటకలోని హోసూరు తాలుకాలో చోటు చేసుకుంది. హత్య తర్వాత ్తను పోలీసులకు లొంగిపోయాడు.

హోసూరు: వివాహేతర సంబంధం కర్ణాటకలో ఓ హత్యకు దారి తీసింది. మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యను భర్త చంపేశాడు.  వివాహేతర సంబంధాన్ని మానుకోవాలని ఎంతగా చెప్పినా వినకపోవడంతో భర్త తలపై బండరాయితో మోది భార్యను హత్య చేశాడు. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. 

ఆ సంఘటన కర్ణాటకలోని హోసూరు తాలుకాలో శుక్రవారంనాడు జరిగింది. హోసూరు జిల్లాలోని ఓ గ్రామంలో చెన్నబసప్ప (44), గౌరమ్మ (40) దంపతులు నివాసం ఉంటున్నారు గౌరమ్మకు పక్కింటి వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. బసప్ప ఆ విషయంపై హెచ్చరిస్తూ వచ్చాడు. అయినా ఆమె పట్టించుకోలేదు.

గురువారం సాయంత్రం ప్రియుడితో తన భార్య సన్నిహితంగా ఉండడాన్ని అతను చూశాడు. దాంతో భార్యను చంపేయాలని పథకం వేసుకున్నాడు. అర్థరాత్రి సమయంలో బార్యను వేపనపల్లి సమీపంలోని కె.ఎన్. పోదూరు బసవేశ్వర స్వామి ఆలయం చెంతకు తీసుకుని వెళ్లాడు. 

ఆలయం వద్ద బండరాయితో ఆమె తలపై మోదాడు. దీంతో ఆమె మరణించాడు. మర్నాడు శుక్రవారం హోసూరు పట్టణ పోలీసు స్టేషన్ లో లొంగిపోయాడు. సమాచారం అందుకున్న వేపనపల్లి పోలీసులు గౌరమ్మ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం అస్పత్రికి తరలించారు. 

PREV
click me!

Recommended Stories

Recharge Price Hike : న్యూఇయర్ లో మీ ఫోన్ మెయింటెనెన్స్ మరింత కాస్ట్లీ.. మొబైల్ రీచార్జ్ ధరలు పెంపు..?
Indigo కు షాక్: 10 శాతం విమానాలు రద్దు.. రంగంలోకి ప్రత్యేక టీమ్ తో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు