షాపింగ్ మాల్ లో డిస్కౌంట్ ఇవ్వలేదని...

Published : Nov 01, 2018, 10:58 AM IST
షాపింగ్ మాల్ లో డిస్కౌంట్ ఇవ్వలేదని...

సారాంశం

డిస్కౌంట్ కోసం ఆశపడి ఓ వ్యక్తి షాపింగ్ చేశాడు. కానీ.. అతనికి ఆ షాపింగ్ మాల్ నిర్వాహకులు డిస్కౌంట్ ఇవ్వలేదు. దీంతో.. ఇద్దరిని కాల్చి చంపేశాడు.

పండగల వేళ.. దుస్తుల దుకాణాలలో, షాపింగ్ మాల్స్ లలో డిస్కౌంట్లు ప్రకటించడం సహజం. చాలా మంది ఆ డిస్కౌంట్లు నచ్చే అవసరం లేకున్నా షాకింగ్ లు చేస్తుంటారు. అయితే.. అలా డిస్కౌంట్ కోసం ఆశపడి ఓ వ్యక్తి షాపింగ్ చేశాడు. కానీ.. అతనికి ఆ షాపింగ్ మాల్ నిర్వాహకులు డిస్కౌంట్ ఇవ్వలేదు. దీంతో.. ఇద్దరిని కాల్చి చంపేశాడు. ఈ దారుణ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం వారణాసిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... వారణాసిలోని జీహెచ్ వీ మాల్ కి బుధవారం ఓ వ్యక్తి  దుస్తులు కొనడానికి వచ్చాడు. అతనికి నచ్చిన దుస్తులు ఎంపిక చేసుకున్న తర్వాత డిస్కౌంట్ గురించి సేల్స్ మెన్ ని అడిగాడు.

అయితే.. డిస్కౌంట్ విషయంలో నిందితుడు, సేల్స్ మెన్ చాలా సేపు చర్చలు జరిపారు. ఎంతసేపు అడిగినా.. తాను కోరిన డిస్కౌంట్ ఇవ్వలేదని నిందితుడు కోపోద్రిక్తుడయ్యాడు. వెంటనే.. దుకాణంలోని నలుగురిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.

ఈ ఘటనలో ఆ వస్త్ర దుకాణంలో పనిచేసే  సునీల్, గోపీ, గోలు, విశాల్ లు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సునీల్, గోపీలు మృతి చెందారు. గోలు, విశాల్ లు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి కూడా విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా.. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దుకాణంలోని సీసీ కెమేరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Rajinikanth vs Kamal Haasan Comments on CM Vijay | Asianet News Telugu
Rajinikanth Pressmeet: సీఎం విజయ్ పై రజినీకాంత్ సంచలన కామెంట్స్ | Asianet News Telugu