సామాన్యుడికి దివాళీ గిఫ్ట్...మళ్లీ సిలిండర్‌ ధర పెంచిన కేంద్రం

By sivanagaprasad kodatiFirst Published Nov 1, 2018, 7:38 AM IST
Highlights

కేంద్రం సామాన్యుడికి దీపావళి కానుకను ప్రకటించింది. అదేదో కొత్త పథకమో లేక... మన ఖాతాలో డబ్బులు వేయడమో కాదు.. వంట గ్యాస్ ధరను పెంచి జనం నడ్డి విరిచింది. 

కేంద్రం సామాన్యుడికి దీపావళి కానుకను ప్రకటించింది. అదేదో కొత్త పథకమో లేక... మన ఖాతాలో డబ్బులు వేయడమో కాదు.. వంట గ్యాస్ ధరను పెంచి జనం నడ్డి విరిచింది. ఈ ఏడాది జూన్ నుంచి సబ్సిడీ వంట గ్యాస్ ధరలను ప్రతి నెల పెంచుకుంటూ పోతున్న కేంద్రం మరోసారి సిలిండర్‌పై భారం మోపింది.

14.2 కేజీల సిలిండర్‌పై రూ.2.94 పెంచింది.. దీంతో సబ్సీడీ సిలిండర్ ధర రూ.505.34కు చేరింది. అలాగే సబ్సిడీయేతర సిలిండర్‌పై రూ.60 పెంచింది. దీంతో దీని ధర రూ.939కి చేరింది. పెరిగిన ధరలు బుధవారం అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ తెలిపింది.

అంతర్జాతీయంగా పెరుగుతున్న ధరలు, విదేశీ మారక ద్రవ్యంలో ఒడిదుడుకుల కారణంగానే ధరలు పెంచినట్లు ఐవోసీఎల్ తెలిపింది. ఇప్పటి వరకు గ్యాస్ వినియోగదారుల ఖాతాలో ఒక్కో సిలిండర్‌కు రూ.376.60 జమ కాగా.. ఈ నెల నుంచి రూ.433.66 జమ కానున్నాయి. గత ఆరు నెలల కాలంలో కేంద్రం ప్రభుత్వం సిలిండర్‌పై రూ.14.15 పెంచింది. 

click me!