మంత్రి గన్ మెన్ ఆత్మహత్య

Published : Oct 31, 2018, 09:15 PM IST
మంత్రి గన్ మెన్ ఆత్మహత్య

సారాంశం

కేరళ నీటిపారుదల శాఖ మంత్రి మాథ్యూ టీ థామస్‌ గన్‌మెన్‌ 28 ఏళ్ల సుజిత్ తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. థామస్ దగ్గర గన్ మెన్ గా పనిచేస్తున్న సుజిత్ కొల్లాం జిల్లా కడకల్‌ గ్రామంలోని తన ఇంట్లో సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకున్నాడు.

తిరువనంతపురం: కేరళ నీటిపారుదల శాఖ మంత్రి మాథ్యూ టీ థామస్‌ గన్‌మెన్‌ 28 ఏళ్ల సుజిత్ తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. థామస్ దగ్గర గన్ మెన్ గా పనిచేస్తున్న సుజిత్ కొల్లాం జిల్లా కడకల్‌ గ్రామంలోని తన ఇంట్లో సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకున్నాడు. శబ్ధాలు రావడంతో గమనించిన కుటుంబ సభ్యులు సుజిత్ ను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. 

మంత్రి మాథ్యూ టీ థామస్‌ దగ్గర 3 నెలలుగా భద్రతా అధికారిగా సుజిత్‌ పని చేస్తున్నారు. సుజిత్ కు ఇంకా వివాహం కాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సుజిత్ తల, చేతుల మణికట్టుపై గాయాలను గుర్తించారు. 

ఆత్మహత్యాయత్నానికి సంబంధించిన ప్రాంతంలో సూసైడ్ నోట్ లభించింది. ఆ లెటర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుజిత్‌ సెలవులో ఉండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

వందేమాతర గేయాన్ని సోనియా గాంధీ అడ్డుకున్నారా.? పంద్రాగ‌స్టు రోజు అస‌లేం జ‌రిగింది.?
అమర వీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళి |Droupadi Murmu Pays Homage at National War Memorial