Nagpur: ఒక షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తనకు స్మార్ట్‌ఫోన్ కొనడానికి నిరాకరించినందుకు తల్లి గొంతు నులిమి ప్రాణాలు తీశాడు. కమలాబాయి బద్వైక్ (47) బుధవారం మృతి చెందారనీ, పోస్ట్‌మార్టంలో గొంతు నులిమి చంపడమే మరణానికి కారణమని పోలీసులు తెలిపారు. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
Smart phone-murder: ఒక షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తనకు స్మార్ట్‌ఫోన్ కొనడానికి నిరాకరించినందుకు తల్లి గొంతు నులిమి ప్రాణాలు తీశాడు. కమలాబాయి బద్వైక్ (47) బుధవారం మృతి చెందారనీ, పోస్ట్‌మార్టంలో గొంతు నులిమి చంపడమే మరణానికి కారణమని పోలీసులు తెలిపారు. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. స్మార్ట్ ఫోన్ కోసం కన్నతల్లి ప్రాణాలు తీసిన షాకింగ్ ఘటన మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో చోటుచేసుకుంది. స్మార్ట్‌ఫోన్ కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వలేదనే కోపంతో తల్లిని గొంతు నులిమి చంపిన 28 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కమలాబాయి బద్వాయిక్ (47) బుధవారం మృతి చెందిందనీ, పోస్టుమార్టంలో గొంతు నులిమి చంపడమే మరణానికి కారణమని తేలడంతో హత్య దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.
తన తల్లిని సోదరుడు రామ్ నాథ్ ఆస్పత్రికి తరలించాడనీ, కొద్దిసేపటికే ఆమె మృతి చెందిందని ఫోన్ వచ్చిందని ఆమె మరో కుమారుడు దీపక్ తెలిపారు. అయితే, తాను శవాన్ని చూడగానే ఏదో లోపం ఉన్నట్లు గ్రహించాడు. ఆమె బంగారు ఆభరణాలు కూడా మాయమయ్యాయని తెలిపారు. శరీరంపై గాయాలు గమనించాడు. దీపక్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అనుమానంతో రామ్ నాథ్ ను విచారించారు. స్మార్ట్ ఫోన్ కోసం డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో కండువాతో ఆమెను హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో అంగీకరించాడని హుద్కేశ్వర్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.