ఢిల్లీలో సహజీవన భాగస్వామి హత్య.. 12 కి.మీల దూరంలో డెడ్ బాడీ

By Mahesh K  |  First Published Apr 21, 2023, 11:46 PM IST

ఇంటి నుంచి పారిపోయి ఢిల్లీలో సహజీవనం చేసుకుంటున్న జంట గొడవ పడింది. తనను పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి తేవడంతో గొడవ జరిగింది. ఆవేశంలో ఆమె గొంతు నులిమి చంపేశాడు. ఈ ఘటన ఏప్రిల్ 12వ తేదీన ఈశాన్య ఢిల్లీలో చోటుచేసుకుంది.
 


న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తనతో సహజీవనంలో ఉన్న 25 ఏళ్ల భాగస్వామిని చంపేశాడు. వారు నివాసం ఉంటున్న ఇంటికి 12 కిలోమీటర్ల దూరంలో డెడ్ బాడీని పడేశారు. ఈశాన్య ఢిల్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

రోహినా, వినీత్‌లు ఒకరినొకరు ఇష్టపడ్డారు. నాలుగేళ్ల క్రితం ఇద్దరూ కుటుంబం నుంచి పారిపోయి ఢిల్లీలో సహజీవనం చేస్తున్నారు. తనను పెళ్లి చేసుకోవాలని రోహినా వినీత్‌పై ఒత్తిడి తేవడం ప్రారంభించింది. ఈ విషయమై ఏప్రిల్ 12వ తేదీన ఇద్దరూ గొడవ పడ్డారు. ఆవేశంతో రోహినా గొంతు నులిమి వినీత్ చంపేశాడు.

Latest Videos

ఆ డెడ్ బాడీని బయట డంప్ చేయడానికి అదే రోజు సాయంత్రం మిత్రుడికి వినీత్ కాల్ చేశాడు. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం, ఆ డెడ్ బాడీని భుజాన మోస్తూ వారిద్దరూ బైక్ పై వెళ్లారు. 12 నుంచి 13 కిలోమీటర్ల వరకు వారు సీసీటీవీ ఫుటేజీల్లో కనిపించారు. మరో చోట వారిద్దరి వెంట వినీత్ సోదరి కూడా కనిపించింది. ఆ డెడ్ బాడీని దాచడానికి ఇద్దరికీ ఆమె సహకరించినట్టు పోలీసులు ఆరోపించారు.

ఏప్రిల్ 12వ తేదీన రాత్రి పూట ఓ ఇంటి ఎదుట డెడ్ బాడీ ఉన్నదని కొందరు పోలీసులకు ఫోన్ చేశారు. ఆ మహిళ మృతదేహంపై గాయాలేమీ లేవు. కానీ, ఆమెను గొంతు నులిమి చంపినట్టు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది.

Also Read: karnataka Election 2023 : ఏషియానెట్ న్యూస్ డిజిటల్ సర్వే - కనిపించని రాహుల్ ప్రభావం, మోడీదే ప్రభంజనం

సుమారు 50 మంది పోలీసులతో ఒక బృందం ఏర్పడి ఈ ఘటన దర్యాప్తును ప్రారంభించారు.

వినీత్ సోదరి పారుల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వారిద్దరితో తానూ ఈ నేరంలో ఉన్నట్టు ఆమె అంగీకరించారు. మిగిలిన ఇద్దరు నిందితులను పోలీసులు గాలిస్తున్నారు.

పోలీసుల ప్రకారం, వినీత్, ఆయన తండ్రి ఇద్దరూ ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పట్ 2019 మర్డర్ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. నిందితుడు గతేడాది నవంబర్‌లో బెయిల్ పై బయటకు వచ్చాడు.

click me!