karnataka Election 2023 : ఏషియానెట్ న్యూస్ డిజిటల్ సర్వే - కనిపించని రాహుల్ ప్రభావం, మోడీదే ప్రభంజనం

By Siva Kodati  |  First Published Apr 21, 2023, 9:15 PM IST

దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై శుక్రవారం సాయంత్రం విడుదలైన ఏషియానెట్ న్యూస్ డిజిటల్ సర్వే కర్ణాటకలోని పలు పార్టీల అగ్రనేతల కళ్లు తెరిపించేలా వుంది. 


మరికొద్దిరోజుల్లో ఎన్నికల బరిలోకి దిగనున్న కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు జాతీయ స్థాయిలో మోడీ వర్సెస్ రాహుల్ పోటీ ఉందని భావిస్తున్నారు. అయితే మెజారిటీ దేశ ప్రజలు మాత్రం ప్రధాన మోడీ పట్ల విశ్వాసంతోనే వున్నారని అనేక సర్వేలు చెబుతున్నాయి. ఇటీవలి ఇంటర్వ్యూలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ప్రధాని మోడీ పర్యటనలు కర్ణాటక ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపవని తేల్చిచెప్పేశారు. ఎందుకంటే ఇవి జాతీయ ఎన్నికలు కావని సిద్ధూ అభిప్రాయపడ్డారు. ప్రజలు స్థానిక సమస్యలను మాత్రమే పరిగణనలోనికి తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు. అయితే శుక్రవారం సాయంత్రం విడుదలైన ఏషియానెట్ న్యూస్ డిజిటల్ సర్వే కర్ణాటకలోని పలు పార్టీల అగ్రనేతల కళ్లు తెరిపించేలా వుంది. 

 

Latest Videos

 

ఎంపీగా అనర్హత వేటు పడిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ద్వారా వచ్చే ప్రజాదరణపై కాంగ్రెస్ దృష్టి సారించింది. అయితే ఏషియానెట్ న్యూస్ డిజిటల్ సర్వే ప్రకారం కన్నడ (69 శాతం), ఇంగ్లీష్ (50 శాతం) రెండింటిలోనూ రాహుల్ గాంధీ ఫ్యాక్టర్ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి సహాయపడదని అభిప్రాయపడ్డారు. 

 

 

దానికి బదులు కన్నడలో 58 శాతం మంది, ఇంగ్లీష్‌లో 48 శాతం మంది వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోడీ ఫ్యాక్టర్ కర్ణాటకలో బీజేపీని గెలిపిస్తుందని అభిప్రాయపడ్డారు. 

 

రిజర్వేషన్ మిస్‌ఫైర్

కర్నాటకలోని కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ అంశంపై బొమ్మై ప్రభుత్వంపై విరుచుకుపడింది, సామాజిక న్యాయానికి కట్టుబడి కాకుండా రాజకీయ నిర్ణయాలను పేర్కొంది. రిజర్వేషన్లకు సంబంధించిన నిర్ణయాలు రాజ్యాంగంలోని నిబంధనలకు అనుగుణంగా లేవని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే షెడ్యూల్డ్ కులాలు , షెడ్యూల్డ్ తెగలలో కొత్త రిజర్వేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయడం వల్ల కర్ణాటకలోని అణగారిని వర్గాలకు కొంత మేలు జరుగుతుందని 75 శాతం మంది కన్నడవాదులు, 58 శాతం మంది ఆంగ్లవాదులు అంగీకరిస్తున్నారని ఏషియానెట్ న్యూస్ డిజిటల్ సర్వే అంచనా వేసింది. 

 

 

కొత్త రిజర్వేషన్ విధానం అణగారిన వర్గాలకు సహాయం చేయదని కన్నడ 21 శాతం, ఆంగ్లంలో 22 శాతం మంది మాత్రమే అభిప్రాయపడ్డారు. వాస్తవానికి 4 శాతం ముస్లిం కోటాను తొలగించి.. లింగాయత్‌లు, ఒక్కలిగలకు సమానంగా పంపిణీ చేయడంలో కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన రిజర్వేషన్ల విధానానికి 62 శాతం మంది కన్నడిగులు, 48 శాతం ఇంగ్లీష్‌వాదులు మద్ధతు పలికారు. 

 

 

మొత్తం మీద కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయని సర్వే అభిప్రాయపడింది. పైగా, రాష్ట్రానికి చెందిన పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకి ఇది అగ్ని పరీక్ష. కర్ణాటక ఫలితాలను బట్టే పార్టీలో అతని స్థానాన్ని పదిలపరుస్తుంది, ఒకవేళ ఓడిపోతే మాత్రం పార్టీలో మరో అసమ్మతి చెలరేగవచ్చు.

click me!