మరో వ్యక్తితో సహజీవనం.. ప్రియురాలిపై అనుమానంతో..

Published : Aug 01, 2020, 09:43 AM IST
మరో వ్యక్తితో సహజీవనం.. ప్రియురాలిపై అనుమానంతో..

సారాంశం

అయితే ఇద్దరికీ వివాహాలు అయినప్పటికీ జీవిత భాగస్వాములను వదిలేసి ఇద్దరూ కలిసి ఉంటున్నారు.  

తాను సహజీవనం చేస్తున్న మహిళ.. తనతోనే కాకుండా మరో వ్యక్తితో కూడా అక్రమ సంబంధం పెట్టుకుందని అతను అనుమానించాడు. ఈ క్రమంలో తన ప్రియురాలితో అతి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని పూణేలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పూణే శివారులోని షిరూర్ గ్రామానికి చెందిన సారిక  అనే మహిళతో.. దత్తాత్రేయ  గైక్వాడ్ అనే వ్యక్తి నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. అయితే ఇద్దరికీ వివాహాలు అయినప్పటికీ జీవిత భాగస్వాములను వదిలేసి ఇద్దరూ కలిసి ఉంటున్నారు.

తర్వాత ఏమైందో కానీ వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. అప్పటినుంచి... సారికను దత్తాత్రేయ అనుమానించడం మొదలుపెట్టాడు. తన కళ్ళుగప్పి తన ప్రియురాలు ఇతరులతో అక్రమ సంబంధం కొనసాగిస్తోందని దత్తాత్రేయ అనుమానించాడు. దత్తాత్రేయ. ఈ అనుమానంతోనే తరచూ దూషించేవాడు. ఈ క్రమంలోనే  బుధవారం రాత్రి ఆమెతో మరోసారి గొడవపడి క్షణికావేశంలో కత్తితో గొంతుకోసి ఆమెను అతి దారుణంగా హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు.
 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌