బాబోయ్.. గురువును చంపి రక్తం తాగాడు.. క్షుద్రశక్తుల కోసం ఓ మంత్రగాడి ఘాతుకం..

By SumaBala BukkaFirst Published Feb 4, 2023, 6:45 AM IST
Highlights

క్షుద్ర శక్తుల కోసం ఓ వ్యక్తి గురువును చంపి రక్తం తాగాడు. ఆ తరువాత శవాన్ని కాల్చేసి పారిపోయాడు. పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఛత్తీస్ గఢ్ : మూఢనమ్మకాలు ఎలాంటి దారుణమైన ఘటనకైనా ఒడిగట్టడానికి వెనుకాడనివ్వవు. క్షుద్రపూజలు, అతీతశక్తులు అంటూ.. ఎంతకైనా తెగిస్తారు. జంతుబలులు, నరబలులు చేస్తూ భయాందోళనలో వ్యాపింపజేస్తారు. అలాంటి ఓ ఒళ్ళు గగుర్పొడిచే ఘటన ఛత్తీస్గఢ్లోని ధమ్ తరీ జిల్లాలో చోటుచేసుకుంది. 50 యేళ్ల బసంత్ సాహు అనే వ్యక్తి క్షుద్ర పూజలు చేస్తాడు. అతనికి శిష్యుడు కూడా ఉన్నాడు. అయితే, ఆ శిష్యుడు గురువుకే పంగనామం పెట్టాడు. క్షుద్ర శక్తుల కోసం ఏకంగా గురువునే చంపేశాడు. ఆ తర్వాత అతడి రక్తాన్ని తాగాడు. 

చదువుతుంటేనే  కడుపులో తిప్పేస్తున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే శిష్యుడ్ని అరెస్టు చేశారు.  దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. 50 సంవత్సరాల బసంత్ సాహు అనే వ్యక్తి క్షుద్ర పూజలు చేస్తుంటాడు. అతని దగ్గర రౌనక్ సింగ్ ఛబ్రా అలియాస్ మన్య చావ్లా (25) క్షుద్ర పూజలు నేర్చుకుంటున్నాడు. ఈ క్రమంలో అన్ని పూజలు తెలిసిన తన గురువును చంపి.. అతని రక్తం తాగితే..  తనకు క్షుద్ర పూజలు వస్తాయని నమ్మాడు.  

దీనికోసం  తన గురువైన బసంత్ సాహు క్షుద్ర పూజలు చేస్తుండగా అతడి మీద దాడి చేసి చంపేశాడు. ఆ తరువాత అతడి రక్తం తాగాడు. తను అనుకున్న పని అయిన తర్వాత గురువు మృతదేహానికి నిప్పు పెట్టి వెళ్లిపోయాడు. విషయం స్థానికుల ద్వారా తెలిసిన పోలీసులు సగం కాలిన మృతదేహాన్ని గురువారం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేశారు.

ఇంత ఘోరమా.. మూడేండ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు నిందితుల అరెస్టు

ఇదిలా ఉండగా, నిరుడు డిసెంబర్ లో హైదరాబాద్ లో క్షుద్రపూల ఘటన కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ లోని ఓ పాఠశాలలో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. రాజేంద్రనగర్ పరిధిలోని ఓ స్కూల్ లో.. క్షుద్రపూజలు జరిగిన ఆనవాళ్లు  విద్యార్థులను, టీచర్లను భయాందోళనలకు గురి చేసింది. స్కూల్లో ని సైన్స్ ల్యాబ్, స్టోర్ రూమ్ లలో క్షుద్రపూజలు జరిగినట్లు ముగ్గులు, బొమ్మలు, విచిత్ర ఆకారాలు ఉన్నాయి. ఏం జరిగిందో కనుక్కోవడానికి టీచర్లు సీసీటీవీ ఫుటేజ్ లు చెక్ చేయడానికి ప్రయత్నించగా.. అవి కూడా కనిపించలేదు. 

దీంతో ఈ ఘటన మీద పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు ప్రారంభించారు. ఈజీ మనీ కోసం క్షుద్ర పూజల పేరుతో దేవాలయాలు, పురాతన భవనాల్లో తవ్వకాలు సాగిస్తూ కొంతమంది హడావుడి చేస్తున్నారు. ఈ కోవలోనే రాజేంద్రనగర్ హైదర్ షాకోట్ స్కూల్లో ఈ క్షుద్రపూజలు జరిగి ఉండొచ్చి పోలీసులు అంటున్నారు. క్షుద్రపూజలు ఎవరు చేశారు? దీని వెనుక ఎవరు ఉన్నారు? అనేది దర్యాప్తులో తేలిందని చెప్పుకొచ్చారు.

click me!