మంచంలో భార్య.. క్షుద్రపూజల అనుమానం: అత్తామామలను నరికిన అల్లుడు

Siva Kodati |  
Published : Aug 15, 2019, 05:56 PM IST
మంచంలో భార్య.. క్షుద్రపూజల అనుమానం: అత్తామామలను నరికిన అల్లుడు

సారాంశం

జార్ఖండ్ సింగ్‌భూమ్ జిల్లా పతండా బస్తీకి చెందిన శివ్‌లాల్ భార్య గత కొద్దినెలలుగా అనారోగ్యంతో బాధపడుతోంది. వీరి కుమారుడు సైతం రెండేళ్ల కిందట మరణించాడు. తన కుటుంబం సర్వనాశనం కావడానికి సొంత అత్తమామలేనని శివ్‌లాల్ అనుమానించాడు.

పిల్లనిచ్చి పెళ్లి చేసిన సొంత అత్తమామలను అల్లుడు అత్యంత కిరాతకంగా నరికి చంపాడు. వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్ సింగ్‌భూమ్ జిల్లా పతండా బస్తీకి చెందిన శివ్‌లాల్ భార్య గత కొద్దినెలలుగా అనారోగ్యంతో బాధపడుతోంది. వీరి కుమారుడు సైతం రెండేళ్ల కిందట మరణించాడు.

తన కుటుంబం సర్వనాశనం కావడానికి సొంత అత్తమామలేనని శివ్‌లాల్ అనుమానించాడు. వారు క్షుద్రపూజలు చేస్తూ తన కుటుంబాన్ని నాశనం చేస్తున్నారని రెండు మూడు సార్లు మందలించాడు.

అయినప్పటికీ శివలాల్ భార్య మంచాన ఉండటం, ఆమె ఆరోగ్య  పరిస్ధితుల్లో ఎటువంటి మార్పు రాకపోవడంతో.. అత్తమామలు క్షుద్రపూజలు చేయడం మానలేదని అతను ఆగ్రహంతో ఊగిపోయాడు.

బుధవారం వారింటికి వెళ్లి పదునైన కత్తితో అత్తమామలను నరికి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శివ్‌లాల్‌ను అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..