వివాహేతర సంబంధం : ఆ స్థితిలో చూసి తట్టుకోలేక.. తల్లి ప్రియుడిని దారుణంగా చంపిన కొడుకు

Siva Kodati |  
Published : Jun 24, 2022, 07:00 PM IST
వివాహేతర సంబంధం : ఆ స్థితిలో చూసి తట్టుకోలేక.. తల్లి ప్రియుడిని దారుణంగా చంపిన కొడుకు

సారాంశం

తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని ఓ కొడుకు తన మిత్రులతో కలిసి దారుణంగా హత్య చేశాడు. బీహార్‌లో జరిగిన ఈ ఘటనను పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.   

బీహార్‌లో (bihar) దారుణం జరిగింది. తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని హత్య చేశాడో కొడుకు. ఈ కేసులో ముగ్గురు  నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. జూన్ 18, 2022న బార్హ్ సబ్ డివిజన్‌లోని మారంచి పోలీస్ స్టేషన్ పరిధిలో మోను అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. అనంతరం అతని మృతదేహాన్ని రైల్వే ట్రాక్‌పై పడేశారు. దీనిపై రంగంలోకి దిగిన పోలీసులు.. విచారణ ప్రారంభించారు. అక్రమ సంబంధం కారణంగానే మృతుడిని హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. బాధితుడికి పలువురితో లైంగిక సంబంధాలు వున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో ఓ మహిళతో అతను ఏకాంతంగా వున్న సమయంలో ఆమె కుమారుడు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. 

అయితే మృతుడు మోను.. బాదల్ అనే నిందితుడితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ అతను తన తల్లితో ఆ స్థితిలో మోనును చూసిన నేపథ్యంలో ఎట్టి పరిస్ధితుల్లోనూ చంపాల్సిందేనని బాదల్ నిర్ణయించుకున్నాడు. పథకంలో భాగంగా తన స్నేహితులు అంకిత్ కుమార్, భాజో సాయంతో బాధితుడిని హత్య చేశాడు. తొలుత అతనికి మద్యం తాగించి.. అనంతరం కత్తితో నరికి చంపారు. మృతుడి శరీరంపై 12 కత్తిపోట్లు వున్నట్లు పోలీసులు తెలిపారు. హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో భాజోపై ఇప్పటికే పలు కేసులు వున్నట్లు పోలీసులు  చెబుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !