ప్రియురాలి సోదరుల చేతిలో ప్రియుడు దారుణహత్య

sivanagaprasad kodati |  
Published : Jan 30, 2019, 11:46 AM IST
ప్రియురాలి సోదరుల చేతిలో ప్రియుడు దారుణహత్య

సారాంశం

ముంబైలో దారుణం జరిగింది. ప్రియురాలి సోదరుల చేతిలో ప్రియుడు హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. మలాద్ ప్రాంతానికి చెందిన సైఫ్ అలీ షరాఫత్ అలీ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని గత కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. 

వీరి ప్రేమ ముదిరిపాకాన పడటంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయతే ఆమెకు వసీం బద్రుద్దీన్ ఖాన్, అజ్మల్ అనే ఇద్దరు సోదరులు ఉన్నారు. వీరు సోదరి ప్రేమను వ్యతిరేకించేవారు. దీనిపై ప్రతిరోజు ముగ్గురి మధ్య గొడవలు జరిగేవి.

ఈ క్రమంలో మంగళవారం సదరు యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో అలీ వెళ్లాడు. ఆమెతో మాట్లాడుతుండగా వసీమ్, అజ్మల్ ఇద్దరు అక్కడికి వచ్చారు. అలీని చూడగానే పట్టరాని ఆగ్రహంతో ఊగిపోయారు. అ

లీని చితకబాదిన అనంతరం వారిలో ఒకరు అలీని కత్తితో విచక్షణారహితంగా పొడిచి అక్కడి నుంచి పారిపోయారు. చుట్టుపక్కల వారు అలీని ఆస్పత్రికి తరలించగా అతను అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం సాయంత్రం పరారీలో ఉన్న వసీమ్, అజ్మల్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu