కుమారస్వామికి చిక్కులు: లంచం కేసులో మంత్రి

By narsimha lodeFirst Published Jan 30, 2019, 11:26 AM IST
Highlights

: కర్ణాటక రాష్ట్ర బలహీనవర్గాల సంక్షేమ శాఖ మంత్రి పట్టరంగశెట్టి చిక్కుల్లో పడ్డారు. మంత్రి వద్ద పనిచేసే పర్సనల్ అసిస్టెంట్ సుమారు 26 లక్షలను తీసుకొంటూ పోలీసులకు చిక్కారు


బెంగుళూరు: కర్ణాటక రాష్ట్ర బలహీనవర్గాల సంక్షేమ శాఖ మంత్రి పట్టరంగశెట్టి చిక్కుల్లో పడ్డారు. మంత్రి వద్ద పనిచేసే పర్సనల్ అసిస్టెంట్ సుమారు 26 లక్షలను తీసుకొంటూ పోలీసులకు చిక్కారు. ఈ ఏడాది జవనరి 5వ  తేదీన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకొన్నారు. ఈ కేసుపై ఏసీబీ విచారణలో  అసలు విషయం వెలుగు చూసింది.

కాంట్రాక్టర్ల నుండి మంత్రికి ఈ డబ్బులు లంచం రూపంలో ముట్టినవేనని ఏసీబీ అధికారులు తేల్చారు. ఏసీబీ అధికారుల నిర్ణయం కారణంగా  మంత్రి పట్టరంగశెట్టికి చిక్కులు తప్పలేదు.ఈ కేసును దర్యాప్తు చేసిన ఏసీబీ అధికారులు పుట్టరంగశెట్టికి లంచం ఇచ్చేందుకు కాంట్రాక్టర్లు ఇచ్చారని  తేల్చారు. 

యోగేష్‌ బాబు, జ్యోతి ప్రకాష్‌, ఉమేష్‌, రాజు, సతీష్‌ అనే  కాంట్రాక్టర్లు లంచంగా  మంత్రికి ఇచ్చారని ఏసీబీ అధికారులు తేల్చారు.  కాంట్రాక్టర్ల నుండి డబ్బులు మంత్రి కార్యాలయంలో టైపిస్టుగా పనిచేస్తున్న మనోహార్ తీసుకొన్నట్గుగా తేలింది. కాంట్రాక్టర్ల నుండి లంచం తీసుకొన్న మొత్తాన్ని విధానసౌధలోకి తీసుకెళ్తున్న సమయంలోనే పోలీసులు ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

ప్రాథమికంగా మంత్రికి లంచం రూపంలో ఈ మొత్తం అందినట్లు తేలడంతో ఆయనకు నోటీసు జారీ చేయాలని ఏసీబీ అధికారులు నిర్ణయించారు. ముఖ్యమంత్రి హెచ్‌.డి.కుమారస్వామికి  మంత్రి పుట్టరంగశెట్టి అత్యంత ఆప్తుడుగా పేరుంది. అయితే మంత్రిని అరెస్ట్ చేస్తారా లేదా  అనే చర్చ సాగుతోంది.  
 

click me!