పరారీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే.. పోలీసుల గాలింపు

Published : Jan 30, 2019, 10:55 AM IST
పరారీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే.. పోలీసుల గాలింపు

సారాంశం

 కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు పరారీలో ఉన్నారు. కాగా.. ఆయన కోసం విస్తృతంగా పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. 

కర్ణాటక రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు పరారీలో ఉన్నారు. కాగా.. ఆయన కోసం విస్తృతంగా పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయినప్పటికీ పెద్దగా ఫలితం కనిపించడం లేదు.

ఇంతకీ అసలు మ్యాటరేంటంటే.., ఈ నెల 19వ తేదీన బెంగళూరులోని బిడిదిలో ఈగల్టన్‌ రిసార్ట్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, గణేష్ లు ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ కు గాయాలయ్యాయి. ఆయన ప్రస్తుతం ఆస్పత్రిలో  చికిత్స పొందుతున్నారు.

కాగా.. దాడికి పాల్పడిన ఎమ్మెల్యే గణేష్ ని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నాలుగు బృందాలుగా ఇప్పటికే ఆయన కోసం ముంబై, పూనా, గోవా, చెన్నైలలో గాలించగా ఆయన ఆచూకీ లభించలేదు. కాగా.. తాజా సమాచారం ప్రకారం గణేష్‌ ఢిల్లీలో ఉన్నట్లు  తెలుస్తోంది.  బీజేపీ అధిష్టానం ఆయనను కాపాడేందుకు ప్రయత్నిస్తోందని రాష్ట్ర కాంగ్రెస్‌ నేత ఒకరు ఆరోపించడం ఇందుకు మరింత ఊతమిస్తోంది.

PREV
click me!

Recommended Stories

మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. కర్ణాటక హైకోర్టు స్టే
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు