తొమ్మిదో అంతస్తు బాల్కనీ నుంచి వేలాడుతూ మహిళ.. అదుపుతప్పి...వీడియో వైరల్..

Published : Jul 15, 2021, 04:44 PM IST
తొమ్మిదో అంతస్తు బాల్కనీ నుంచి వేలాడుతూ మహిళ.. అదుపుతప్పి...వీడియో వైరల్..

సారాంశం

ఈ వీడియోలో...ఓ మహిళ బిల్డింగ్ బాల్కనీలో నుంచి వేలాడుతూ కనిపించింది. ఆమె కిందికి పడకుండా ఓ వ్యక్తి ఆమె చేయి పట్టుకుని ఉన్నాడు. బహుశా అతను ఆమె భర్తై ఉండొచ్చు. కానీ కొన్ని సెకన్ల తరువాత, అతని పట్టు వదిలింది. దీంతో ఆమె కిందికి పడిపోయింది. 

ఢిల్లీ: ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణ సంఘటన జరిగింది. భర్తతో గొడవపడి ఓ మహిళ బాల్కనీలోనుంచి దూకేప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో కింద పడడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఈ వీడియోలో...ఓ మహిళ బిల్డింగ్ బాల్కనీలో నుంచి వేలాడుతూ కనిపించింది. ఆమె కిందికి పడకుండా ఓ వ్యక్తి ఆమె చేయి పట్టుకుని ఉన్నాడు. బహుశా అతను ఆమె భర్తై ఉండొచ్చు. కానీ కొన్ని సెకన్ల తరువాత, అతని పట్టు వదిలింది. దీంతో ఆమె కిందికి పడిపోయింది. 

అయితే అప్పటికే ఆమె కిందికి వేలాడడాన్ని గమనించిన స్థానికులు కింద దుప్పట్లు పట్టుకుని ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. అయితే అది పెద్దగా ఉపయోగం లేకపోయిందని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం జరిగినట్లు సమాచారం.

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. బిల్డింగ్ లోని తొమ్మిదవ అంతస్తు బాల్కనీలో మహిళ ఓ వ్యక్తితో తీవ్ర వాగ్వాదానికి దిగింది. ఏమైందో తెలీదు కానీ ఆమె అకస్మాత్తుగా రైలింగ్స్ పైకి ఎక్కి దూకడానికి ప్రయత్నించింది. ఈ హఠాత్ పరిణామానికి షాక్ అయిన ఆ వ్యక్తి దాదాపు మూడు నిమిషాల పాటు.. ఆమె చేతిని పట్టుకోగలిగాడు. ఆ తరువాత వదిలేశాడు. అయితే అప్పటికే కింద దుప్పట్లతో స్థానికులు సిద్ధంగా ఉన్నారు. కానీ అవి ఆమెను ఆపలేకపోయాయి. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా, ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు.

దీనిమీద ఎటువంటి ఫిర్యాదు అందకపోయినా.. వీడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, సంఘటన గురించి స్పష్టత కోసం ఆ వ్యక్తిని ప్రశ్నించారు. ఇక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళ స్పృహలోకి వచ్చాక ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసి, అతని వెర్షన్ క్రాస్ చెక్ చేస్తామని... అప్పుడే విషయంలో స్పష్టత వస్తుందని ఒక పోలీసు అధికారి తెలిపారు.

PREV
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu