వృద్ధుడి ఖాతాలో రూ.52కోట్లు జమ.. ఏం చేశాడంటే..!

Published : Sep 18, 2021, 12:45 PM IST
వృద్ధుడి ఖాతాలో  రూ.52కోట్లు జమ.. ఏం చేశాడంటే..!

సారాంశం

మరో వృద్ధుడి ఖాతాలో ఏకంగా రూ. 52 కోట్లు జమ అయినట్లు తేలింది. ఈ ఘటన ముజఫరాపూర్‌ జిల్లాలో చోటు చేసుకుంది.

ఓ వృద్ధుడి ఖాతాలో దాదాపు రూ.52కోట్ల జమ అయ్యాయి.  ఈ సంఘటన బిహార్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్‌లో ఇటీవల పలువురి అకౌంట్లలో కోట్లాది రూపాయల డబ్బు జమ అవుతోంది. గురువారం ఇద్దరు విద్యార్థులు ఖాతాలో  రూ. 960 కోట్లు జమ అయినట్లు వార్త వైరల్‌ కాగా, శుక్రవారం మరో వృద్ధుడి ఖాతాలో ఏకంగా రూ. 52 కోట్లు జమ అయినట్లు తేలింది. ఈ ఘటన ముజఫరాపూర్‌ జిల్లాలో చోటు చేసుకుంది.

బ్యాంకులో పింఛన్‌ ఖాతా బయోమెట్రిక్‌ వెరిఫికేషన్‌ కోసం వెళ్లిన వృద్ధుడు రామ్‌ బహదూర్‌షా తన ఖాతాలోని బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకున్నాడు. అతని అకౌంట్లో ఏకంగా రూ. 52 కోట్లు జమ అయినట్లు తెలుసుకున్నారు. అంత డబ్బు తన ఖాతాలో ఉండటం తనకు ఆశ్చర్యం కలిగించిందని చెప్పాడు. ఇలా అత్యధిక మొత్తం బ్యాంకులో జమ అయితే ఆయా ఖాతాలను అధికారులు నిలిపివేస్తున్నారు. తన ఖాతాలో పడిన సొమ్ము నుంచి ఎంతో కొంత తనకు అందించాలని వృద్ధుడు ప్రభుత్వాన్ని కోరాడు. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం