covid 19 : మళ్లీ పెరుగుతున్న కేసులు.. ఆ రాష్ట్రంలోనే ఎక్కువ..

Published : Sep 18, 2021, 11:16 AM IST
covid 19 : మళ్లీ పెరుగుతున్న కేసులు.. ఆ రాష్ట్రంలోనే ఎక్కువ..

సారాంశం

సగానికిపైగా కేసులు ఒక్క కేరళలోనే నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో నిన్న 23 వేలకు పైగా కేసులు  వెలుగు చూడగా... 131మరణాలు చోటుచేసుకున్నాయి. ఇక మహారాష్ట్రలో 3,586 మంది వైరస్ బారిన పడ్డారు. 24 గంటల వ్యవధిలో 35,662 మందికి కరోనా సోకింది. 281 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఢిల్లీ : ఈ వారం మొదట్లో తగ్గినట్టే కనిపించిన కరోనా కేసులు.. మళ్ళీ పెరుగుతున్నాయి. అంతక్రితం రోజుతో పోల్చితే తాజాగా 3.6 శాతం మేర పెరిగిన కేసులు 35 వేలకు చేరాయని... శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను విడుదల చేసింది.

ఇక సగానికిపైగా కేసులు ఒక్క కేరళలోనే నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో నిన్న 23 వేలకు పైగా కేసులు  వెలుగు చూడగా... 131మరణాలు చోటుచేసుకున్నాయి. ఇక మహారాష్ట్రలో 3,586 మంది వైరస్ బారిన పడ్డారు. 24 గంటల వ్యవధిలో 35,662 మందికి కరోనా సోకింది. 281 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కేసులు 3.34 కోట్లకు చేరగా... 3.26 కోట్ల మంది వైరస్ ను జయించారు. నిన్న ఒక్కరోజే 33 వేల మంది కోలుకున్నారు.  ప్రస్తుతం 3.4  లక్షల మంది చికిత్స పొందుతున్నారు.

నిరుడు జనవరి నుంచి మహమ్మారి కారణంగా 4,44,529 మంది మృత్యుఒడికి చేరుకున్నారు.  ప్రస్తుతం క్రియాశీల కేసుల రేటు  1.02 శాతంగా ఉండగా..  రికవరీ రేటు  97.65 శాతానికి చేరింది. నిన్న 14.48 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.

నిన్న ప్రధాని మోదీ పుట్టినరోజు వేళ కరోనా టీకా కార్యక్రమం జెట్ స్పీడ్తో ముందుకు వెళ్ళింది. ఒక్కరోజే 2.5 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు  కేంద్రం వెల్లడించింది.  దీంతో మొత్తంగా పంపిణీ అయిన డోసుల సంఖ్య 79.42 కోట్లకు చేరింది. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం