ట్రాఫిక్ రద్దీలోనూ కారు పైకప్పు పై కూర్చుని పెగ్గేస్తున్న మందుబాబు.. వైరల్ వీడియో ఇదే

Published : Jan 09, 2023, 06:00 PM IST
ట్రాఫిక్ రద్దీలోనూ కారు పైకప్పు పై కూర్చుని పెగ్గేస్తున్న మందుబాబు.. వైరల్ వీడియో ఇదే

సారాంశం

ట్రాఫిక్ రద్దీలో ఓ వ్యక్తి కారు రూఫ్ పై కూర్చుని ఆల్కహాల్ తాగాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఒకరు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నది.  

న్యూఢిల్లీ: చుట్టూ ట్రాఫిక్ రద్దీ.. ఎటు చూసినా వాహనాలే. అలాంటి స్థితిలో ఓ వ్యక్తి కారు రూఫ్ పై కూర్చుని పెగ్గేస్తూ కనిపించాడు. చుట్టూ రణగొణ ధ్వనులు ఉన్నప్పటికీ కామ్‌గా కూర్చుని లిక్కర్ బాటిల్ ముందు పెట్టుకుని ఓ వీడియోలో కనిపిస్తున్నాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. తేదీ వివరాలేవీ లేని ఈ వీడియోను ట్విట్టర్‌లో రవి హండా అనే యూజర్ షేర్ చేశాడు. ఇలాంటివి కేవలం గుర్గావ్‌లోనే జరుగుతాయని క్యాప్షన్ పెట్టాడు.

15 సెకండ్ల ఈ క్లిప్‌లో గుర్తు తెలియని ఓ వ్యక్తి కారు పైన కూర్చుని లిక్కర్ తాగుతున్నట్టు కనిపించాడు. నడిరోడ్డులో ట్రాఫిక్‌లో ఉన్న కారుపై అతను కనిపించాడు. కాగా, ప్యాసింజర్ సీటులోని ఓ వ్యక్తి ఒక ఖాళీ గ్లాసును పైన కూర్చున్న వ్యక్తి అందించడం కూడా కనిపించింది. పైన కూర్చున్న ఆ వ్యక్తి ఎంప్టీ గ్లాసును చేతిలోకి తీసుకుని అందులో లిక్కర్ పోయడానికి ఉపక్రమించాడు. 

Also Read: భార్యను చంపేసి ఆత్మహత్య చేసుకున్న టాప్ ఆర్మీ ఆఫీసర్..పంజాబ్‌లో ఘటన

ఈ వీడియోపై నెటిజన్ల నుంచి రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ఇది ఎంతమాత్రం జోక్ కాదు అంటూ ఒకరు సీరియస్ అయ్యారు. ఒక్కసారి పోలీసు పట్టుకుని అంటిస్తే.. మత్తు వదిలి పోతుంది అంటూ మరొక యూజర్ కామెంట్ చేశారు. నాగరికంగా ఉండకుండా ఉండటానికి కొందరు ఎన్నో కారణాలు వెతుక్కుంటూ ఉంటారు అని వ్యంగ్యంగా ఒకరు పేర్కొన్నారు. మరికొద్ది కాలంలో లేదా.. ఇప్పుడే అతను జైలులో ఉండొచ్చు అని వేరే యూజర్ కామెంట్ చేశారు.

PREV
click me!

Recommended Stories

Indigo కు షాక్: 10 శాతం విమానాలు రద్దు.. రంగంలోకి ప్రత్యేక టీమ్ తో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. పెంచుతుంది : యోగి ఆసక్తికర కామెంట్స్