ట్రక్కును ఢీకొన్న అంబులెన్స్, గర్భిణి సహా ఇద్దరు మహిళలు దుర్మరణం.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

Published : Jan 09, 2023, 03:37 PM IST
ట్రక్కును ఢీకొన్న అంబులెన్స్, గర్భిణి సహా ఇద్దరు మహిళలు దుర్మరణం.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

సారాంశం

మధ్యప్రదేశ్‌లో గర్భిణితో వెళ్లుతున్న ఓ అంబులెన్స్ ట్రక్కును ఢీకొంది. దీంతో అంబులెన్స్‌లోని గర్భిణి సహా మరో మహిళ మరణించింది. అలాగే, వారి వెంటే ఉన్న మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.  

భోపాల్: మధ్యప్రదేశ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. పురిటి నొప్పులతో తల్లడిల్లుతున్న ఓ గర్భిణిని హాస్పిటల్‌కు తీసుకెళ్లుతున్న అంబులెన్స్ ఓ ట్రక్కును ఢీకొంది. దీంత గర్భిణి సహా ఆమె వెంటే ఉన్న మరో మహిళ మరణించారు. అదే అంబులెన్స్‌లో ప్రయాణిస్తున్న గర్భిణి భర్త, మరో ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలు అయ్యాయి. వారికి హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. కానీ, వారి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నదని తెలిసింది.

ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్‌పూర్ జిల్లాలో ఆదివారం రాత్రి జరిగింది. కొత్వాలీ పోలీసు స్టేషన్ పరిధిలోని ఛత్రాసాల్ క్రాస్ రోడ్ దగ్గర ఈ దుర్ఘటన జరిగింది. మరణించిన గర్భిణిని రమాదేవి (26), ఆమె వదిన రమాకాలి (38)లుగా గుర్తించారు. కాగా, గర్భిణి భర్త దయా రామ్ (29), బాబులాల్ ఆదివాసీ (35), ఖేంబాటి (32)లు గాయపడ్డారు. వీరంతా ఛత్తర్‌పూర్ జిల్లా బామిత గ్రామ నివాసులు.

Also Read: మైనర్ కూతురిపై పలుమార్లు లైంగికదాడి.. గర్భవతైన 14 ఏళ్ల బాలిక.. షాద్‌నగర్‌లో నిందితుడి అరెస్ట్

గాయపడిన వారిలో ఒకడైన బాబులాల్ ఆదివాసీ చెప్పిన వివరాల ప్రకారం, ఆ గర్భిణికి పురిటి నొప్పులు ప్రారంభం అయ్యాయని అందుకే ఆమెను హాస్పిటల్ తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. బామిత గ్రామం నుంచి ఓ అంబులెన్స్‌లో తాము బయల్దేరామని చెప్పారు. ఛత్రాసాల్ క్రాస్ రోడ్డు దగ్గర అంబులెన్స్‌కు యాక్సిడెంట్ అయిందని వివరించారు.

పోలీసులు కేసు నమోదు చేశారని, దర్యాప్తు చేస్తున్నారని జిల్లా ట్రాఫిక్ ఇంచార్జీ కైలాశ్ కుమార్ పటేల్ తెలిపారు.

PREV
click me!

Recommended Stories

జపాన్ ప్రధాని కి భారత్ స్టైల్ ల్లో అదిరిపోయే వెల్ కమ్ | PM Modi Welcomes Japanese PM Sanae Takaichi
మోదీ పవర్ ఫుల్ స్పీచ్ కి జపాన్ ప్రధాని ఫిదా: PM Modi Speech Impresses Japan PM | Asianet News Telugu