యమధర్మరాజుకు రోడ్ల లీజ్.. బెంగళూరులో వినూత్న నిరసన...

Published : Jul 26, 2022, 09:00 AM IST
యమధర్మరాజుకు రోడ్ల లీజ్.. బెంగళూరులో వినూత్న నిరసన...

సారాంశం

నగరంలోని రోడ్ల దుస్థితిని ఎత్తిచూపుతూ బెంగళూరులో ఓ వ్యక్తి విచిత్ర రీతిలో నిరసన వ్యక్తం చేశాడు. నరకాధిపతి యమరాజు వేషధారణలో దున్నపోతును పట్టుకుని ఓ వ్యక్తి నిరసనకు దిగాడు. 

బెంగళూరు : Bengaluruలోని రోడ్ల దుస్థితి మీద నిరసనగా 'చేంజ్‌మేకర్స్ ఆఫ్ కనకపుర రోడ్' అనే సంస్థ ఒక దున్నపోతుతో పాటు మృత్యుదేవత యమరాజు వేషధారణలో ఉన్న వ్యక్తితో నిరసన ప్రదర్శన నిర్వహించింది. దీన్ని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ వీడియోలో వెనకనుంచి నిరసనకారుల అరుపులు గట్టిగా వినిపిస్తున్నాయి. ఆ అరుపుల మధ్య యమధర్మరాజు వేషంలో ఉన్న వ్యక్తి.. గేదెతో పాటు రోడ్డు మధ్యలో నిలబడి కనిపిస్తున్నాడు. 

"రోడ్డు మధ్యలో యమధర్మరాజా? అని ఆశ్చర్యపోకండి.. యమధర్మరాజుకు ప్రజల ప్రాణాలు తీయడానికి ఎమ్మెల్యే కృష్ణప్ప,  BDA కలిసి టెండర్ ఇచ్చారు! నిన్న # CMKR అంజనాపురంలోని గుంతల రోడ్లపై ఒక ప్రత్యేక నిరసన చేశారు. నిరుడు కూడా వర్షాకాలంలో రోడ్ల దుస్థితి మీద తీవ్రమైన నిరసనలు వ్యక్తం చేశారు. అయినా కూడా.. MLA కానీ..  BDA కానీ మొద్దునిద్ర పోతూనే ఉన్నారు’ అంటూ కనకపుర రోడ్‌కు చెందిన చేంజ్‌మేకర్స్ ట్వీట్ చేశారు.

క్రిమినల్ లాను వేధింపుల సాధనంగా ఉపయోగించకూడదు - మహ్మద్ జుబేర్ కేసులో సుప్రీంకోర్టు

‘ఈ రోడ్డు గురించి చెప్పడానికి మేము యమధర్మరాజు థీమ్‌ను ఎంచుకున్నాం. ఎందుకంటే ఈ రహదారిని ఉపయోగించే ప్రయాణికులకు నరకం కనిపిస్తుంది. అందుకే ఇదే సరైన థీమ్ అనిపించింది. అని కనకపుర రోడ్‌కు చెందిన చేంజ్‌మేకర్స్ కు చెందిన అబ్దుల్ అలీమ్ అన్నారు. ఈ రోడ్డు గత పదేళ్లుగా అతి దారుణంగా ఉంది. ఇదొక్కటే కాదు అంజనాపురంలోని రోడ్లన్నీ ఒకేలా అధ్వాన్నంగా ఉన్నాయి. నిరుడు మేము చేసిన ప్రత్యేక నిరసన కొంత ఫలితాలిచ్చింది. అయితే, కేవలం 2 కిలోమీటర్ల రోడ్డు వేశారు. 13 కిలోమీటర్ల రోడ్డు కోసం 25 కోట్లు విడుదలయ్యాయి’’ అని అలీం తెలిపారు.

యమధర్మరాజు పేరు చెప్పి ఎమ్మెల్యే, బిడిఎ అధికారులను ఇంత అవమానించినా వారిలో చలనం లేదు. స్థానికులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఈ రోడ్ల వల్ల అంబులెన్స్ కూడా రావడం వీలవక.. కారులో తరలించడంతో ఓ అపార్ట్ మెంట్ మృతి చెందాడని.. చెప్పుకొచ్చాడు. బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ (బిడిఎ), స్థానిక ఎమ్మెల్యే ప్రయాణికుల సమస్యలను పరిష్కరించేందుకు త్వరలో రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలని.. సమస్యను త్వరగా పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఉగ్ర నిరసనలు చేపడతామని అలీం హెచ్చరించారు.


 

PREV
click me!

Recommended Stories

Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !
కేవలం పదో తరగతి చదివుంటే చాలు.. రూ.57,000 జీతంతో కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు