దారుణం.. టూవీలర్ తో 71యేళ్ల వృద్ధుడిని ఈడ్చుకెళ్లాడు... ఏమైందంటే..

Published : Jan 18, 2023, 07:31 AM IST
దారుణం.. టూవీలర్ తో 71యేళ్ల వృద్ధుడిని ఈడ్చుకెళ్లాడు... ఏమైందంటే..

సారాంశం

టూ వీలర్ తో ఓ 71యేళ్ల వృద్ధుడిని ఈడ్చుకెళ్లిన ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. కిలోమీటర్ మేర ఈడ్చుకెళ్లాక.. స్థానికులు ఆ యువకుడిని పట్టుకున్నారు. 

బెంగళూరు : ఢిల్లీలో నూతన సంవత్సరం రోజు జరిగిన ఓ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. స్కూటీని ఢీ కొట్టిన కారు.. స్కూటీ మీద వెడుతున్న ఓ యువతి కారు కింద చిక్కుకోగా.. అలాగే 17 కిలోమీటర్లు ప్రయాణించి... ఆ యువతి దారుణ మరణానికి కారణం అయ్యారు. ఈ ఘటనతో దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దారుణమైన ఈ ఘటనలో యువతికి న్యాయం చేయాలని దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. ఈ సంఘటన మరువక ముందే అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. అలాంటి ఘటనే బెంగళూరులో మంగళవారం చోటుచేసుకుంది. 

ఓ యువకుడు బండి నడుపుకుంటూ రాంగ్ రూట్లో వచ్చాడు. ఇంకేముంది ఇంకో వాహనాన్ని ఢీకొట్టాడు. తప్పు తనదని తెలుసు కాబట్టి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో అమానుషంగా వ్యవహరించాడు. బెంగళూరులోని మాగడి రోడ్డు టోలుగేటు వద్దకు టూవీలర్ పై ఓ యువకుడు వచ్చాడు. అతడి పేరు సోహైల్ (25). వేగంగా వచ్చి ఓ జీపును ఢీకొట్టాడు. దీంతో ద్విచక్ర వాహనానికి, జీపుకు డ్యామేజ్ అయింది. జీపు డ్రైవర్ ముత్తప్ప శివ శంకరప్ప (71) ఒక కుదుపుకు కంగారుపడ్డాడు. ఆ జీపు దిగి,స్థానికుల సహాయంతో యువకుడిని పట్టుకున్నారు. దెబ్బతిన్న జీపుకు రిపేర్ చేయించాలని అడిగాడు. లేదంటే రిపేరుకు అయ్యే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

పండుగ పూట దారుణం.. మైనర్ బాలికపై ఐదుగురు యువకుల గ్యాంగ్ రేప్.. నిందితుల కోసం గాలింపులు..

అయితే, సదరు నిందితుడు మాత్రం తన టు వీలర్ కూడా దెబ్బతిన్నది అని, అయినా తను ఎందుకు డబ్బులు ఇవ్వాలని ప్రశ్నించాడు. వారితో వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత  అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. అయితే యువకుడు పారిపోకుండా పట్టుకునే ప్రయత్నంలో జీపు డ్రైవర్ ముత్తప్ప బైక్ ను గట్టిగా  పట్టుకున్నాడు. అయితే నిందితుడు మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా అలాగే ముత్తపతో సహా బైక్ ను ముందుకు దూకించాడు. 

బైక్ ను ఆపకుండా.. కిలోమీటర్ దూరం వరకు ముత్తప్పను అలాగే ఈడ్చుకువెళ్ళాడు. రోడ్డు మీద వెళ్తున్న వాహనదారులు ఇది గమనించారు. వెంటనే టు వీలర్ ను ఆపి.. ముత్తపను కాపాడారు. ఆ యువకుడికి దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించి యువకుడిని పట్టించారు.
 

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu