బంగారం అక్రమరవాణాలో స్మగ్లర్ల తెలివి చూస్తే షాకవ్వాల్సిందే !!  

By Rajesh KarampooriFirst Published Jan 18, 2023, 6:29 AM IST
Highlights

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ₹ 4.54 కోట్ల విలువైన 8 కిలోల బంగారు పేస్ట్ స్వాధీనం చేస్తున్న కస్టమ్స్ అధికారులు. రికవరీ చేసిన బంగారాన్ని చాలా వరకు ప్రయాణికుల లోదుస్తుల్లో దాచి ఉంచడం వల్ల గుర్తించడం చాలా కష్టమైంది. 

కస్టమ్ అధికారులు, పోలీసులు ఎంత పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న అంతర్జాతీయ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. భారీ ఎత్తున బంగారం, డ్రగ్స్,  విదేశీ కరెన్సీ విదేశీల నుంచి మనదేశంలోకి వస్తుంది. ప్రధానంగా బంగారం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. పోలీసులు అప్రమత్తమై సోదాలు నిర్వహించి.. భారీ మొత్తంలో బంగారం సీజ్ చేస్తున్న యదేచ్ఛగా అక్రమ బంగారాన్ని తరలించడాన్ని ప్లాన్ వేస్తున్నారు. ప్రయాణికులకు సోదాలు చేస్తూ కస్టమ్స్ అధికారులు పంపిస్తున్న మిగతావారిలో ఆభయం కనిపించడం లేదు.

ఈ వార్తలను మామూలు విషయంగానే తీసుకుంటూ అక్రమ రవాణాకు తరలించే పనిలో పడుతున్నారు. అధికారులు ఎంత పకడ్బందీ చర్యలు చేపట్టినా అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటంలేదు. అక్రమ రవాణా మాత్రం ఏదో ఒక విధంగా కొనసాగుతూనే వుంది. నిత్యం ఎక్కడో ఒక చోట బంగారం స్మగ్లింగ్ గ్యాంగులు రెచ్చిపోతూనే ఉన్నారు. అయితే ఎవరికీ పట్టుబడకుండా రకరకాల కొత్త మార్గాలలో బంగారాన్ని అక్రమ రవాణా చేస్తున్నారు. నిత్యం దేశ వ్యాప్తంగా కిలోల మేర బంగారం అక్రమ రవాణా జరుగుతుంది . ఇక ఎయిర్ పోర్ట్ లలో అయితే బంగారం స్మగ్లింగ్ చేస్తున్న వారిని పట్టుకోవటం నిత్య కృత్యంగా మారింది. తాజాగా  ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ మొత్తంలో బంగారం పట్టు బడింది. అక్రమ రవాణా చేస్తున్న వారిపై కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. 
 

వివరాల్లోకెళ్తే.. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ప్రయాణికులను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అరెస్టు చేసింది. వారి నుంచి ₹ 4.54 కోట్ల విలువైన 8.230 కిలోల బంగారాన్ని పేస్ట్ రూపంలో స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి ముంబైకి వెళ్లే ప్రయాణికుల సిండికేట్ ద్వారా పేస్ట్ రూపంలో బంగారాన్ని భారత్‌లోకి స్మగ్లింగ్ చేస్తున్నట్లు డీఆర్‌ఐకి నిర్దిష్ట సమాచారం ఉందని DRI అధికారి చెప్పారు. దీని ప్రకారం.. అనుమానాస్పద ప్రయాణికులను ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో DRI అధికారుల బృందం గుర్తించి, అడ్డగించింది. వారి అన్వేషణలో పేస్ట్ రూపంలో ఉన్న 8.230 కిలోల బంగారం రికవరీకి దారితీసింది.

బంగారం విలువ ₹ 4.54 కోట్లు ఉంటుందని అధికారి తెలిపారు. రికవరీ చేయబడిన బంగారంలో ఎక్కువ భాగం ప్రయాణీకుల లోదుస్తులలో దాచడం వలన గుర్తించడం చాలా కష్టంగా ఉందనీ,  ఇది DRI చే ఛేదించబడిన ప్రత్యేకమైన కార్యకలాపం అని అధికారి తెలిపారు. ఇద్దరు ప్రయాణీకులను అరెస్టు చేశామని, దేశంలోకి అక్రమంగా బంగారాన్ని తరలించిన వ్యక్తుల పూర్తి గొలుసును విప్పేందుకు తదుపరి విచారణ కొనసాగుతోందని అధికారి తెలిపారు.

click me!