కూతురి పెళ్లి కోసం పైసా పైసా కూడబెట్టి... రూ. 2 లక్షలు, పేదలకు 5 వేల చొప్పున పంపిణీ

By Siva Kodati  |  First Published May 16, 2021, 3:50 PM IST

భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. వైరస్‌ను కట్టడి చేసేందుకు ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ విధించగా, మరికొన్ని చోట్ల కర్ఫ్యూ తరహా వాతావరణం వుంది. అయినప్పటికీ కోవిడ్ కేసులు పెరుగున్నాయే తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు.


భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. వైరస్‌ను కట్టడి చేసేందుకు ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ విధించగా, మరికొన్ని చోట్ల కర్ఫ్యూ తరహా వాతావరణం వుంది. అయినప్పటికీ కోవిడ్ కేసులు పెరుగున్నాయే తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు. ఇదే సమయంలో కరోనా ప్రభావం పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలపైనా పడింది.

లాక్‌డౌన్‌ కారణంగా వివాహా కార్యక్రమాలు పరిమిత సంఖ్యలో జరుగుతున్నాయి. లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూ తక్కువ మందితో పెళ్లిళ్లు నిర్వహిస్తున్నారు ప్రజలు. అయితే పెళ్లికి తాము పెట్టాలనుకున్న ఖర్చును ఈ విపత్కర పరిస్ధితుల్లో పేదలకు పంచి పెట్టి తన పెద్ద మనసు చాటుకున్నాడో మహానుభావుడు. 

Latest Videos

undefined

వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం మైసూర్‌ నగరంలోని తిలక్‌ నగరకు చెందిన హరీశ్‌ అనే వ్యక్తి కుమార్తె వివాహం మే 12,13వ తేదీల్లో జరపాలని పెద్దలు నిశ్చయించారు. కానీ, రాష్ట్రంలో కోవిడ్ కేసుల తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది.

దీంతో హరీశ్ తన బిడ్డ పెళ్లిని ఇంట్లోనే నిరాడంబరంగా నిర్వహించాడు. అలాగే పెళ్లి కోసం దాచుకున్న రూ.2లక్షల సొమ్మును 40 పేద కుటుంబాలకు రూ.5వేల చొప్పున పంచిపెట్టారు. విపత్కర పరిస్ధితుల్లో హరీశ్ చేసిన మంచి పనిని స్థానికులు ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 

click me!