తమిళనాడులో దారుణం: భార్య సహా ఐదుగురి హత్య, ఆపై సూసైడ్ చేసుకున్న భర్త

Published : Dec 13, 2022, 10:45 AM ISTUpdated : Dec 13, 2022, 11:12 AM IST
 తమిళనాడులో దారుణం: భార్య సహా  ఐదుగురి హత్య, ఆపై సూసైడ్ చేసుకున్న భర్త

సారాంశం

తమిళనాడు తిరువణ్ణామలైలో దారుణం జరిగింది.  కుటుంబ కలహలతో  భార్య సహా ఐదుగురు పిల్లలను చంపిన తర్వాత  పళని అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు

చెన్నై:తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలైలో దారుణం చోటు చేసుకుంది.  కుటుంబ కలహాలతో భార్య సహా  పిల్లలను గొడ్డలితో  నరికి చంపాడు . ఆ తర్వాత తాను  ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలతో  భూమిక అనే చిన్నారి  ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.భార్య వల్లీతో పాటు  పిల్లలను గొడ్డలితో నరికి చంపాడు పళని. భార్య వల్లీ, చిన్నారులు శిరీష, మనీషా, శిశశక్తి,, ధనుష్ మృతి చెందారు. పళని దాడిలో  భూమిక  తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.  భార్య, పిల్లలను గొడ్డలితో  నరికి చంపిన తర్వాత  పళని తాను ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.గంజాయి మత్తులో  పళని  ఈ దారుణానికి పాల్పడినట్టుగా  తెలుస్తుంది. కొన్ని రోజులుగా ఆర్ధిక  ఇబ్బందులతో పళని కుటుంబం  బాధపడుతుంది. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.  కరోనా తర్వాత  పళని కుటుంబం  ఆర్ధికంగా చితికిపోయింది. దీంతో  భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు.

కరోనా తర్వాత  పళని కుటుంబం  ఆర్ధికంగా చితికిపోయింది. దీంతో  భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. పళని  స్థానికంగా భూమిని కౌలు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయం  చేయడానికి  అవసరమైన పెట్టుబడికి అప్పులు చేశాడు.  అప్పులు పెరిగిపోవడం ఆర్ధికంగా  ఇబ్బంది పడుతున్నారు.  కరోనా సమయంలోనే  పళని కుటుంబం ఆర్ధికంగా చితికిపోయిందని స్థానికులు చెబుతున్నారు. అప్పుల బాధ తట్టుకోవడానికి  పళని గంజాయికి అలవాటుపడ్డాడు. నిన్న కూడా గంజాయి సేవించి వచ్చాడు.ఈ సమయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.దీంతో  పళని  గొడ్డలితో  భార్యను  చంపాడు. ఆ తర్వాత పిల్లలను కూడా గొడ్డలితో నరికాడు.  భార్య, పిల్లలు చనిపోయారని  నిర్ధారించుకున్న తర్వాత పళని  ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.   

ఈ ప్రాంతంలో గంజాయి  విక్రయం పెరిగిపోయింది.  అయితే  గంజాయిని మానుకోవాలని  పళనితో  ఆయన భార్య వల్లీ గొడవకు దిగేది.  ఈ విషయమై భార్యాభర్తల మధ్య గొడవలు జరిగినట్టుగా స్థానికులు చెబుతున్నారు. నిన్న ఉదయం పిల్లలను తీసుకెళ్లి బిర్యానీ కూడా తినిపించాడు పళని. సాయంత్రం అధిక మోతాదులో గంజాయి సేవించి పళని ఇంటికి వచ్చాడు. దీంతో భార్య వల్లీ భర్తతో గొడవకు దిగింది.ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. కోపంతో ఊగిపోయిన  పళని భార్యాపిల్లలను నరికి చంపాడు.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?