చనిపోయిన భర్తతో తిలకం దిద్దారు: కేసు నమోదు చేసిన పోలీసులు

Published : May 31, 2021, 07:32 PM IST
చనిపోయిన భర్తతో  తిలకం దిద్దారు: కేసు నమోదు చేసిన పోలీసులు

సారాంశం

వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన యువతీ యువకుల ప్రేమ పెళ్లి చివరకు విషాదాంతంగా ముగిసింది. ఈ ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

కోల్‌కత్తా: వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన యువతీ యువకుల ప్రేమ పెళ్లి చివరకు విషాదాంతంగా ముగిసింది. ఈ ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో చోటు చేసుకొంది. బెంగాల్ రాష్ట్రంలోని బర్దమాన్ లో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.  ప్రేమించుకొని ఈ జంట వివాహం చేసుకొన్నారు. అయితే ఇద్దరివి వేర్వేరు కులాలు. దీంతో యువతి తల్లిదండ్రులు ఈ పెళ్లిని వ్యతిరేకించారు.  దీంతో రెండు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి.  ఈ గొడవలతో యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు.   ఈ విషయం తెలుసుకొన్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. 

ఈ విషయం తెలిసిన మృతుడి పేరేంట్స్, బంధువులు యువతి ఇంటి ముందు ధర్నాకు దిగారు.  చనిపోయే ముందు యువకుడు ఫోటోలు పంపినా యువతి పట్టించుకోలేదని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.  కనీసం తమకు సమాచారం ఇచ్చినా కూడ  యువకుడిని కాపాడుకొనేవాళ్లమని  ఆళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యువతి తల్లిపై దాడికి దిగారు. ఆ తర్వాత యువతిని తీసుకొచ్చి చనిపోయిన యువకుడి చేతితో తిలకం దిద్దించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌