ప్రేమ పెళ్లి.. భార్య చనిపోవడంతో తట్టుకోలేక..

Published : Jul 22, 2020, 07:24 AM IST
ప్రేమ పెళ్లి.. భార్య చనిపోవడంతో తట్టుకోలేక..

సారాంశం

మనస్తాపం చెందిన పవిత్ర ఇటీవల పట్టాభిరామంలోని తల్లి ఇంటికి వెళ్లింది. ఈ నెల 15న ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

వారిద్దరూ ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే.. పెళ్లి జరిగి సంవత్సరాలు గడుస్తున్నా వారికి సంతానం కలగలేదు. దీంతో.. ఈ విషయమై భార్యభర్తల మధ్య తరచూ వాదనలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో భార్య ఆత్మహత్య చేసుకోగా... ఆమె మరణాన్ని తట్టుకోలేక భర్త కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన తమిళనాడులో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

దిలీపన్‌ నగర్‌కు చెందిన అరవింద రాజా (26) పెయింటర్‌. 2016లో పవిత్ర (24)ను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి సంతానం లేదు. దీంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. మనస్తాపం చెందిన పవిత్ర ఇటీవల పట్టాభిరామంలోని తల్లి ఇంటికి వెళ్లింది. ఈ నెల 15న ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

ఈ విషయం అరవవిందరాజన్‌కు తెలియడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. సోమవారం ఇంటిలో ఉరివేసుకుని తనువు చాలించాడు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు అరవింద ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్‌ పెట్టాడు. అందులో తాను ప్రేమ వివాహం చేసుకున్నామని.. ఆమె లేకుండా నేను జీవించలేకపోతున్నానని.. ఇద్దరి మృతికి పవిత్ర ప్రేమ కారణమని పేర్కొన్నాడు.
 

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?