బాయ్‌ఫ్రెండ్‌ను కలవడానికి వెళ్లిన ఎయిర్‌హోస్టెస్ శవమై తేలింది

Siva Kodati |  
Published : Jul 21, 2020, 05:53 PM IST
బాయ్‌ఫ్రెండ్‌ను కలవడానికి వెళ్లిన ఎయిర్‌హోస్టెస్ శవమై తేలింది

సారాంశం

గురుగ్రామ్‌లో ఓ ఎయిర్‌హోస్టెస్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. దీనిపై దర్యాప్తు జరిపిన పోలీసులు ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

గురుగ్రామ్‌లో ఓ ఎయిర్‌హోస్టెస్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. దీనిపై దర్యాప్తు జరిపిన పోలీసులు ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఆదివారం రాత్రి 10 గంటలకు సెక్టార్ 65లో బెస్టెక్ పార్క్ వ్యూ స్పాలో 26 ఏళ్ల పెగ్గిలా భూటియా ఐదో అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు.

బాధితురాలి సోదరి బాబిలా భూటియా ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే పెగ్గిలా ఓ గెట్ టూ గెదర్ పార్టీకి హాజరైన సమయంలో ఇలా జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది.

దీంతో ఆ సమయంలో అక్కడే ఉన్న ఆమె భాయ్ ఫ్రెండ్‌ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెగ్గిలా తన బాయ్‌ఫ్రెండ్‌తో మూడేళ్ల నుంచి రిలేషన్‌లో ఉన్నారు. అయితే గత నాలుగు వారాల నుంచి అతను పెగిలాకు దూరంగా ఉంటున్నాడు.

అక్కడితో ఆగకుండా ఆమెను సోషల్ మీడియాలో సైతం బ్లాక్ చేశాడు. అయినప్పటికీ బాయ్‌ఫ్రెండ్‌తో కలవడానికి పెగ్గిలా చాలా ప్రయత్నించింది. అయితే ఎప్పుడూ లేని విధంగా అతను సెక్టార్ 65లోని తన ఫ్రెండ్ నివాసంలో గెట్ టూ గెదర్‌కు హాజరు కావాల్సిందిగా పెగ్గిలాకు మెయిల్ పంపాడు.

దీంతో ఆమె అక్కడికి వెళ్లారు. అనంతరం కొద్దిసేపటికే ఈ విషాదం చోటు చేసుకుందని బాబిలా తెలిపారు. దీని వెనుక ఏం జరిగిందో ఆరా తీయాల్సిందిగా బాబిలా పోలీసులను కోరారు. మరోవైపు బిల్డింగ్ పైనుంచి పడి తీవ్రగాయాలతో ఉన్న పెగ్గిలాను ఆసుపత్రికి తరలించారని గురుగ్రామ్ పోలీసులు తెలిపారు.

అయితే అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని.. సెక్షన్ 306 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?