ఢిల్లీ మెట్రోలో జుగుప్సాకర ఘటన..  మైనర్ బాలిక ఎదుట కామాంధుడి హస్తప్రయోగం

Published : Aug 31, 2023, 04:17 PM ISTUpdated : Aug 31, 2023, 04:21 PM IST
ఢిల్లీ మెట్రోలో జుగుప్సాకర ఘటన..  మైనర్ బాలిక ఎదుట కామాంధుడి హస్తప్రయోగం

సారాంశం

Delhi Metro: మరోసారి ఢిల్లీ మెట్రో వార్తల్లోకి ఎక్కింది. ఈసారి సభ్యసమాజం సిగ్గుతో తల దించుకునే అతిజిగుప్సాకరమైన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ మైనర్ బాలిక పట్ల ఓ కామాంధుడు అత్యంత నీచంగా ప్రవర్తించారు. ఇంతకీ ఏమైందంటే?

Delhi Metro: మరోసారి ఢిల్లీ మెట్రో వార్తల్లోకి ఎక్కింది. ఈసారి సభ్యసమాజం సిగ్గుతో తల దించుకునే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. తల్లితో కలిసి ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తున్న ఓ మైనర్ బాలిక పట్ల ఓ కామాంధుడు అత్యంత నీచంగా ప్రవర్తించాడు. ఈ ఘటనను వివరించడానికి కనీసం పదాలు కూడా రావడం లేదంటే ..  ఆ నీచుడు ఎంత దారుణంగా వ్యవహరించాడో మీరే ఊహించండి.ఆ దారుణాన్ని గమనించిన ఆ తల్లి నిర్గాంతురాలైపోయింది.

 ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయింది. నిస్సాహాయురాలైన ఆ తల్లి తన కూతురితో సహా మెట్రో రైలు దిగిపోయింది. ఈ సమయంలో ఆ నీచుడి ప్రవర్తనను గమనించిన తోటి ప్రయాణికులు వాడిని చిత్కకబాది.. రైల్వే సిబ్బందికి అప్పగించారు. ఈ ఘటన ఢిల్లీ మెట్రోలోని 'రెడ్ లైన్'లో బుధవారం వెలుగులోకి వచ్చింది. 

రక్షాబంధన్ కావడంతో  బుధవారం (నిన్న) సాయంత్రం మెట్రో రైలు ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. ఈ క్రమంలో రాత్రి 8 గంటల ప్రాంతంలో మెట్రో రైలులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు తనతోటీ ప్రయాణికురాలైన ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. ఆ చిన్నారిని చూస్తూ.. హస్తప్రయోగం చేస్తూ.. అత్యంత నీచంగా వ్యవహరించాడు. ఈ విషయాన్ని గ్రహించిన ఆ చిన్నారి తల్లి అప్రమత్తమైంది. ఆ తర్వాత ఆ తల్లి తన చిన్నారితో సహా తరువాతి స్టేషన్ అయినా సీలంపూర్ మెట్రో స్టేషన్‌లో దిగిపోయింది.   

ఈ ఘటనను గమనించిన ఇద్దరు తోటి ప్రయాణికులు ఆ నీచుడ్ని పట్టుకుని  షాహదారా స్టేషన్‌లో మెట్రో అధికారులకు అప్పగించారు. ఆ కామాంధుడిని పశ్చిమ బెంగాల్  చెందిన వ్యక్తిగా గుర్తించారు. అనంతరం స్టేషన్ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు.
 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం