ముంబై బాలుడికి ఏకకాలంలో డెంగ్యూ, మలేరియా, లెప్టో.. మూడు రోజుల్లోనే మృతి

Siva Kodati |  
Published : Aug 31, 2023, 04:01 PM IST
ముంబై బాలుడికి ఏకకాలంలో డెంగ్యూ, మలేరియా, లెప్టో.. మూడు రోజుల్లోనే మృతి

సారాంశం

ముంబైకి చెందిన బాలుడు ఏకకాలంలో మలేరియా, లెప్టో, డెంగ్యూ బారినపడి ప్రాణాలు కోల్పోయాడు. సీనియర్ వైద్యుడు గిరీష్ రాజాధ్యక్ష ప్రకారం.. మూడు వ్యాధులు ఒకేసారి సోకడం చాలా అరుదుగా జరుగుతుందన్నారు. 

ముంబైకి చెందిన బాలుడు ఏకకాలంలో మలేరియా, లెప్టో, డెంగ్యూ బారినపడి ప్రాణాలు కోల్పోయాడు. కుర్లాకు చెందిన 14 ఏళ్ల ఈ బాలుడు ఏకకాలంలో డెంగ్యూ, మలేరియా, లెప్టోస్పిరోసిస్‌తో బాధపడుతున్నట్లు జాతీయ వార్తా సంస్థ టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. ఈ నెల ప్రారంభంలో తొలుత బాలుడికి జ్వరం వచ్చింది. అయినప్పటికీ తల్లిదండ్రులు వైద్యుడిని సంప్రదించలేదు. ఇంటికి దగ్గరలోని స్థానిక వైద్యుడినే వీరు ఆశ్రయించారు. 

ఈ క్రమంలో ఆగస్ట్ 14న ప్రభుత్వ ఆధ్వర్యంలోని కస్తూర్బా ఆసుపత్రిలో వైద్యులను సంప్రదించారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో డెంగ్యూ, మలేరియా పాజిటివ్‌గా తేలింది. ఆశ్చర్యకరంగా అదనపు పరీక్షలో పిల్లాడికి లెప్టోస్పిరోసిస్ కూడా వున్నట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే బాలుడి పరిస్ధితి విషమించడంతో ముంబై సెంట్రల్‌లోని నాయర్ ఆసుపత్రికి తరలించారు. తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్యల కారణంగా బాలుడిని వెంటిలేటర్‌పై వుంచారు. శ్వాసకోశ సమస్యలతో అతని క్రియాటినిన్ స్థాయిలు కూడా ఎక్కువగా వున్నాయని నివేదిక పేర్కొంది. 

రాగింగ్ లక్షణాలు, ఇన్ఫెక్షన్లు , మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్స్‌ను నియంత్రించడానికి వైద్యులు ప్రయత్నించినప్పటికీ బాలుడు ఆసుపత్రిలో చేరిన మూడు రోజుల్లోనే మరణించాడు. సీనియర్ వైద్యుడు గిరీష్ రాజాధ్యక్ష ప్రకారం.. మూడు వ్యాధులు ఒకేసారి సోకడం చాలా అరుదుగా జరుగుతుందన్నారు. ముందుగానే వైద్య సహాయం అందించి వుంటే బాలుడు ప్రాణాలతో వుండేవాడని వైద్యులు తెలిపారు. ముంబై పౌర సంఘం వర్షాకాల నివేదిక ప్రకారం.. ఆగస్టులో డెంగ్యూ, మలేరియా కేసులు గణనీయంగా పెరిగాయి. బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ (బీఎంసీ) ఆగస్టులో 959 మలేరియా కేసులు, 265 లెప్టోస్పిరోసిస్ కేసులు నమోదైనట్లుగా తేల్చింది. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?