బిజీ రోడ్డులో కూలిన ఇనుప పిల్లర్.. షాకింగ్ వీడియో వైరల్...

By SumaBala Bukka  |  First Published Jun 28, 2023, 12:04 PM IST

ఓవర్ హెడ్ రైల్వే బ్రిడ్జికి సపోర్టుగా ఉన్న పిల్లర్ ఒక్కసారిగా ఒరిగిపోయి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో వాటర్ ట్యాంకర్, వాహనదారుడు తృటిలో తప్పించుకున్నారు. 


బెంగళూరు : కర్ణాటకలో రద్దీగా ఉండే రోడ్డు మధ్యలో ఇనుప స్తంభం గ్రిడ్ కూలిపోవడం కలకలం సృష్టించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణాపాయం, ఆస్తినష్టం వాటిల్ల లేదు. రెప్పపాటు కాలంలో ఈ ప్రమాదంనుంచి వాహనాలు, పలువురు వాహనదారులు తప్పించుకున్నారు. ఈ ప్రమాదం రాష్ట్రంలోని మౌలిక సదుపాయాల నాణ్యతపై ప్రశ్నలు లేవనెత్తింది. 

ఈ సంఘటన కర్ణాటకలోని వాణిజ్య కేంద్రమైన హుబ్బల్లిలో బుధవారం రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు జరిగింది. ఓవర్ హెడ్ రైల్వే బ్రిడ్జికి సపోర్టుగా ఉన్న పిల్లర్ ఒక్కసారిగా ఒరిగిపోయి... కుప్పకూలింది. ఈ సమయంలో ఓ వాటర్ ట్యాంకర్ సెకన్ ముందే దాన్ని దాటగా.. ఓ టూవీలర్ మీదున్న ఇద్దరు ప్రయాణికులు తృటిలో తప్పించుకున్నారు. వీడియో చూసిన వారికి ఈ ఘటన షాక్ కు గురి చేస్తోంది. 

Tap to resize

Latest Videos

అదుపుతప్పి నదిలో పడిన మినీ ట్రక్కు.. 12 మంది దుర్మరణం..

"రైల్వే బ్రిడ్జి నెం 253 దగ్గర.. 4.2 మీటర్ల పొడవుతో.. హైట్ గేజ్‌ని ఏర్పాటు చేశారు. రాత్రివేళల్లో దానికంటే ఎత్తుగా ఉన్న వాహనం ఈ  గేజ్‌ను ఢీకొట్టిందని అనుమానిస్తున్నారు. రోడ్డు వాహనాల ప్రకంపనల కారణంగా నిర్మాణం మరింత బలహీనపడిందని అనుమానిస్తున్నారు. నిర్మాణం ఒకవైపు వంగి, ఆ తర్వాత కిందకు పడిపోయింది" అని సౌత్ వెస్ట్రన్ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.

undefined

"నిర్మాణం తొలగించబడింది. కొత్త హైట్ గేజ్ ఏర్పాటు చేస్తాం. ఇంకా, రంబుల్ స్ట్రిప్‌లు, అదనపు సంకేతాలు వెంటనే రహదారిపై పెడతాం" అని అందులో తెలిపారు. 

 


Motorists and vehicles had a narrow escape as an iron pillar grid collapsed in the middle of a busy road in pic.twitter.com/iUFh8FKzVB

— Kiran Parashar (@KiranParashar21)
click me!