వీడి దుంపతెగ.. హెల్మెట్ లేదన్నందుకు ట్రాఫిక్ పోలీసు వేలు కొరికేశాడు..

By SumaBala Bukka  |  First Published Feb 13, 2024, 2:43 PM IST

హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతున్న ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. చలాన్ రాస్తున్నారు. ఇంతలో ఆ వ్యక్తి వారినుంచి పారిపోవడానికి చేసిన పనితో షాక్ అయ్యారు. 


కర్నాటక : బెంగుళూరులో ఒక వ్యక్తి ట్రాఫిక్ పోలీసు సిబ్బందిమీద రెచ్చిపోయాడు.. నానా హంగామా చేశాడు. ఓ పోలీసు వేలు కొరికాడు. దీనికి సంబంధించిన వీడియో బాగా వైరల్ అవుతోంది. దీనిమీద నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 సయ్యద్ సఫీ అనే వ్యక్తి విల్సన్ గార్డెన్ 10వ క్రాస్ సమీపంలో హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ కనిపించాడు. వెంటనే ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ తన స్కూటర్ కీ ని తీసుకున్నాడు. మరో హెడ్ కానిస్టేబుల్ సిద్ధరామేశ్వర కౌజలగి ట్రాఫిక్ ఉల్లంఘనను రికార్డ్ చేయడానికి ప్రయత్నించాడు.

Latest Videos

హర్యానా-పంజాబ్ సరిహద్దులో ఉద్రిక్తత.. రైతులపై బాష్పవాయువు ప్రయోగం.. ఎందుకంటే ?

అయితే, 28 ఏళ్ల  సయ్యద్ సఫీ ట్రాఫిక్ కానిస్టేబుళ్లిద్దరి మీదికీ ఎదురుతిరిగాడు. ఓ దశలో తాళాలు తీసుకుంటున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ వేలు కొరికాడు. తాను అర్జంటుగా ఆసుపత్రికి వెడుతున్నానని.. అందుకే హెల్మెట్ పెట్టుకోవడం మర్చిపోయానని చెబుతూ.. ఇప్పుడు తీస్తున్న తన వీడియో వైరల్‌గా మారినా పట్టించుకోనని చెప్పడం అందులో వినపడుతోంది.

అంతేకాదు, సయ్యద్ సఫీ హెడ్ కానిస్టేబుల్ ఫోన్‌ను లాక్కొని, వీడియో ఎందుకు రికార్డ్ చేస్తున్నారని దబాయించాడు. అక్కడినుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు.

వెంటనే అతడిని పట్టుకుని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. "విల్సన్ గార్డెన్ 10వ క్రాస్ వద్ద అనుమానితుడు ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను దుర్భాషలాడాడని, అతని వేలు కొరికి గాయపరిచాడు" అని పోలీసులు తెలిపారు.

విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని దుర్భాషలాడడం, శారీరకంగా గాయపర్చడం, నేరపూరిత బెదిరింపులు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకు అతనిపై కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు.

click me!