Bengaluru: హెల్మెట్ లేదని బైక్ ఆపితే ట్రాఫిక్ కానిస్టేబుల్ వేలు కొరికాడు.. అధికారులు ఏం చేశారంటే?

By Mahesh K  |  First Published Feb 13, 2024, 2:32 PM IST

బెంగళూరులో ట్రాఫిక్ పోలీసు ఓ వాహన చోదకుడిని అడ్డుకోగా.. ఆ రైడర్ పోలీసు కానిస్టేబుల్ వేలుకొరికాడు. హెల్మెట్ పెట్టుకోలేదని పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నది.
 


Traffic Constable: ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే పోలీసులు వెంటనే ఆ ఉల్లంఘనుడిని పట్టుకుంటారు. జరిమానా వేస్తారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కోసం ప్రత్యేకంగా డ్రైవ్‌లు చేపడతారు. ఇలాగే..బెంగళూరులో ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుళ్లు రోడ్డు పక్కన నిలబడి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నవారిని పట్టుకుంటున్నారు. అప్పుడే ఓ వ్యక్తి స్కూటీపై రయ్ మని వచ్చాడు. ఆయన హెల్మెట్ ధరించలేదు. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు బైక్‌ను ఆపారు. ఆయనను పక్కకు రమ్మన్నారు. తన చేతిని వదలాలని, బైక్ కీ ఇచ్చేయాలని ఆ ప్రయాణికుడు రెచ్చిపోయాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్ చేతిని కొరికేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నది.

సయ్యద్ సఫీ అనే వ్యక్తి హెల్మెట్ ధరించకుండా స్కూటీని డ్రైవ్ చేసుకుంటూ బయల్దేరాడు. విల్సన్ గార్డెన్ 10వ క్రాస్ వద్ద పోలీసులకు చిక్కాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆ స్కూట్ కీను తీసుకుని పక్కకు వస్తుండగా హెడ్ కానిస్టేబుల్ సిద్ధరామేశ్వర కౌజలాగి వీడియో తీశాడు.

Latest Videos

28 ఏళ్ల సయ్యద్ సఫీ ట్రాఫిక్ కానిస్టేబుళ్లతో గొడవకు దిగాడు. ఒక దశలో పోలీసు కానిస్టేబుల్ చేతి వేళ్లను కొరికే ప్రయత్నం చేశాడు. తద్వార పోలీసు కీని తీసుకోవాలని అనుకున్నాడు. కానీ, పోలీసు కానిస్టేబుల్ జాగ్రత్త పడ్డాడు.

Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను సీఎం చేయాలని చంద్రబాబుకు అమిత్ షా షరతు? అందుకే పొత్తు ప్రకటనలో జాప్యం?

తాను హాస్పిటల్ వెళ్లుతున్నాడని, అందుకే తొందర్లో హెల్మెట్ పెట్టుకోవడం మరచిపోయాడని సయ్యద్ సఫీ వివరించాడు. తనను ఎందుకు వీడియో తీస్తున్నాడని ప్రశ్నించాడు. వీడియో తీసినా తనకు ఏ నష్టం లేదని అన్నాడు. ఆ తర్వాత కానిస్టేబుల్ ఫోన్‌ను లాక్కున్నాడు. 

: A scooterist, who was caught riding without , BITES a constable near Wilson Garden 10th Cross.

Gets . pic.twitter.com/Wsatq9d5XM

— Rakesh Prakash (@rakeshprakash1)

పోలీసులు వెంటనే ఆయనను పట్టుకున్నారు. అరెస్టు చేశారు. విల్సన్ గార్డెన్ టెన్త్ క్రాస్ వద్ద పోలీసు కానిస్టేబుల్‌ను డ్యూటీలో ఉండగా దూషించాడని, ఆయన వేలు కొరికి గాయపరిచినట్టు పోలీసులు పేర్కొన్నారు.

click me!