పేరు మార్చుకుని మహిళను నమ్మించి మోసం చేశాడు.. తండ్రితోనూ అక్రమ సంబంధానికి బలవంతం

Published : Jun 03, 2023, 07:30 PM IST
పేరు మార్చుకుని మహిళను నమ్మించి మోసం చేశాడు.. తండ్రితోనూ అక్రమ సంబంధానికి బలవంతం

సారాంశం

ఉత్తరప్రదేశ్‌లో ఓ దుండగుడు తన పేరును మార్చి చెప్పి ఓ మహిళను మోసం చేశాడు. పరిచయం పెంచుకుని పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా వశపరుచుకున్నాడు. ఆ తర్వాత తండ్రితోనూ అక్రమ సంబంధానికి బలవంతం చేశాడు.  

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ దుండగుడు తన పేరును మార్చుకుని మహిళతో పరిచయం చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా ఆమెతో కలిశాడు. ఆ తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే ఆ వీడియోలు ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేస్తానని బెదిరించాడు. అనంతరం, తన తండ్రితోనూ అక్రమ సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో చోటుచేసుకుంది. తన గుర్తింపును దాచినందుకు ఈ వ్యక్తి పై కేసు నమోదైంది. పోలీసులు అరెస్టు కూడా చేశారు.

అబిద్ అనే ఓ వ్యక్తి 24 ఏళ్ల మహిళతో పరిచయం పెంచుకున్నాడు. తన పేరు అంకిత్ అని అబద్ధం చెప్పాడు. ఆమెతో సన్నిహితంగా మెలిగి పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. అదే హామీ పై శారీరకంగా ఆమెతో కలిశాడు.

ఆ తర్వాత ఆమె ప్రైవేట్ ఫొటోలను, వీడియోలతో బెదిరించాడు. తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే ఆ వీడియోలను ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేశాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు తనను బలవంతంగా మతం మార్పించారని, మాంసం పెట్టి బలవంతంగా తినిపించారని ఆమె ఆరోపించింది. అంతేకాదు, తన తండ్రితో అక్రమ సంబంధం పెట్టుకునేలా నిందితుడు బలవంతం చేశాడని పేర్కొంది.

Also Read: గర్ల్‌ఫ్రెండ్ పై అనుమానం.. స్క్రూ డ్రైవర్‌తో 51 సార్లు పొడిచి చంపిన దుండగుడు

ఆ కుటుంబం అంతా కలిసి తనను నిర్బంధించారని, తనపై దాడి చేశారని ఆమె ఆరోపణలు చేసింది. ఎలాగోలా వారి నుంచి తప్పించుకుని ఈ ఫిర్యాదు చేసినట్టు వివరించింది. 

ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్టు సిటీ ఎస్పీ రాహుల్ భాటి తెలిపారు. దర్యాప్తు మొదలు పెట్టామని, ఆధారాలు సేకరించాక లీగల్ యాక్షన్ తీసుకుంటామని వివరించారు.

PREV
click me!

Recommended Stories

Ahmedabad International Kite Festival సంక్రాంతి సంబరాల్లో పతంగ్ లు ఎగరేసిన మోదీ| Asianet News Telugu
Digital Health : ఇక వైద్యరంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ... కీలక పరిణామాలు