మల్కన్‌గిరిలో రూ.225 కోట్ల విలువైన గంజాయి సీజ్

By narsimha lodeFirst Published Sep 22, 2021, 11:20 AM IST
Highlights

ఒడిశా రాష్ట్రంలోని మల్కన్ గిరిలో 2,265 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ గంజాయి విలువ రూ.225 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు.

భువనేశ్వర్: ఒడిశా (odisha)రాష్ట్రంలోని మల్కన్ గిరిలో (malkangiri)  బుధవారం నాడు భారీగా గంజాయి పట్టుకొన్నారు. 2,256 కిలోల గంజాయిని(ganja) పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.ఒడిశా నుండి ఛత్తీస్‌ఘడ్ కు గంజాయిని తరలిస్తుండగా మల్కన్ గిరి  వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు.  గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

పోలీసులు సీజ్ చేసిన గంజాయి విలువ రూ. 225 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇటీవల కాలంలో ద తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు సాగుతున్నాయి. పోలీసుల కళ్లుగప్పి గంజాయి సరఫరా సాగుతుంది.  అయితే పోలీసులు నిఘా ఏర్పాటు చేసి  గంజాయి  సరఫరా కాకుండా చర్యలు తీసుకొంటున్నారు.గంజాయిని ఎవరు తరలిస్తున్నారు, ఛత్తీస్ ఘడ్ లో ఎక్కడికి తరలిస్తున్నారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో కూడ గంజాయిని ఇటీవల కాలంలో పోలీసులు సీజ్ చేశారు. గంజాయి సరఫరా చేసే వారిని గుర్తించి పోలీసులు కేసఃు నమోదు చేస్తున్నారు. 
 

click me!