
న్యూ ఢిల్లీ : జోహ్రీపూర్‌లోని జైన్ కాలనీలో 45 ఏళ్ల వ్యక్తి తన భార్య, కుమార్తెలపై కిటికీ అద్దంతో దాడి చేశాడు. ఒక వ్యక్తి తన భార్య, కుమార్తెలపై దాడి చేశాడని, గాయపడిన వారిని జిటిబి ఆసుపత్రిలో చేర్చినట్లు కరవాల్ నగర్ పోలీస్ స్టేషన్‌కు పిసిఆర్ కాల్ వచ్చింది. ఫోన్ అందుకున్న వెంటనే హుటాహుటిన పోలీసులు ఆసుపత్రికి చేరుకోగా, తల్లి మరియు ముగ్గురు కుమార్తెలు తీవ్ర గాయాలతో కనిపించారు. ఈ నలుగురిని వారి బంధువు ఒకరు ఆసుపత్రిలో చేరినట్లు పోలీసులు గుర్తించారు.
విచారణలో, గురువారం ఉదయం 7.15 గంటల సమయంలో, దీప్ సైన్ తన భార్యతో గొడవ పడ్డాడు, ఈ సమయంలో అతను పగిలిన కిటికీల ముక్కతో ఆమెపై దాడి చేశాడు. తల్లి కేకలు విన్న కుమార్తెలు ఆమెను రక్షించడానికి వచ్చారు. అయితే నిందితుడు కుమార్తెలపై కూడా దాడి చేశారు.
వీరిలో ఒక కుమార్తెకు కడుపుపై గాయం కాగా, మిగిలిన వారి ఛాతీ, చేతులపై గాయాలయ్యాయి. దాడి అనంతరం దీప్‌సైన్ అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు వారి బంధువుల్లో ఒకరికి ఫోన్ చేసి విషయం చెప్పారు. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని.. నలుగురిని ఆసుపత్రికి తరలించారు.
ఈ నలుగురిలో 18 ఏళ్ల కూతురు చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇంతలో, 23 ఏళ్ల కుమార్తె, 42 ఏళ్ల తల్లి ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు. 21 సంవత్సరాల మూడవ కుమార్తె డిశ్చార్జ్ చేయబడింది. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసు బృందాలను రప్పించారు. ఈ విషయమై కేసు నమోదు చేశారు.
Termination of Pregnancy : పెళ్లి కాని మహిళ కూడా అబార్షన్ చేసుకోవచ్చు - సుప్రీంకోర్టు
ఇదిలా ఉండగా, తన కుమారుడి ప్రేమ పెళ్లిని జీర్ణించుకోలేని ఓ తల్లి నిండు గర్భిణి అయిన కోడలిపై పెట్రోల్ పోసి, నిప్పంటించి కడుపులోని మగపిల్లల మరణానికి కారణం అయింది. ఈ దారుణమైన ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కంగ్డి మండలం రామతీర్థం గ్రామానికి చెందిన బొడ్డు శంకర్ కుటుంబం రెండు సంవత్సరాల క్రితం అచ్చంపేటకు వలస వచ్చారు. అక్కడే స్థిరపడ్డారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. అదే గ్రామానికి చెందిన కురటి పండరి, బొడ్డు శంకర్ పెద్దకుమార్తె కీర్తనలు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఇంట్లో ఒప్పుకోకపోవడంతో చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు.
కూతురి వివాహాన్ని కీర్తన కుటుంబసభ్యులు ఆమోదించినా...ఈ వివాహం పండరి కుటుంబ సభ్యులకు నచ్చలేదు. వివాహం చేసుకుని ఇంటికి వచ్చినప్పటి నుంచి అత్త అంబవ్వ కోడలితో తరచూ గొడవ పడుతూ ఉండేది. ఈ నేపథ్యంలో పలుమార్లు పంచాయితీలు కూడా జరిగాయి. పంచాయితీలో పెద్దల సూచనల మేరకు కీర్తన, పండరిలను పని కోసం హైదరాబాద్కు పంపించారు. అయితే, అలా వెళ్ళిన కొడుకు, కోడలు పొలం పనుల కోసం వారం రోజుల క్రితం అచ్చంపేటకు వచ్చారు. సోమవారం కొడుకుని పొలానికి పంపిన అంబవ్వ ఇంట్లో ఉన్న కోడలు కీర్తనపై పెట్రోల్ పోసి నిప్పంటించింది.
మంటలకు తాళలేక..ఆమె వేసిన కేకలు విన్న ఇరుగు పొరుగు వారు వచ్చి బాధితురాలిని చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె అధిక భాగం కాలడంతో కడుపులో ఉన్న మగ కవలలు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అత్త మీద కేసు నమోదు చేసి రిమాండ్కు పంపినట్లు పోలీసులు తెలిపారు.