ప్రతిపక్షాలకు తృణమూల్ షాక్.. వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలో ఓటేయం

Published : Jul 22, 2022, 04:31 AM IST
ప్రతిపక్షాలకు తృణమూల్ షాక్.. వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలో ఓటేయం

సారాంశం

ప్రతిపక్షాలకు తృణమూల్ కాంగ్రెస్ భారీ షాక్ ఇచ్చింది. విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఓడిపోయిన రోజే.. తాము ప్రతిపక్షాల వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థికి మద్దతు తెలుపబోమని వెల్లడించింది. ఉప రాష్ట్రపతి ఎన్నికలో తాము ఎవరికీ మద్దతు ఇవ్వబోమని ఆ పార్టీ తెలిపింది.  

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికతో ప్రతిపక్షాలు ఏకతాటి మీదికి వచ్చాయనే అభిప్రాయం చాలా మందిలో కలిగింది. కానీ, ఆ ఐక్యత ఉప రాష్ట్రపతి ఎన్నిక వరకైనా నిలువలేకపోయింది. ప్రతిపక్షాలకు తృణమూల్ కాంగ్రెస్ షాక్ ఇచ్చింది. ప్రతిపక్షాల ఉప రాష్ట్రపతి ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు ఓటేయం అని స్పష్టం చేసింది. అసలు వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలో ఎవరికీ ఓటేయబోమని వెల్లడించింది.

దేశ ఉప రాష్ట్రపతి ఎన్నిక వచ్చే నెల 6వ తేదీన జరగనుంది. ఎన్డీయే తరఫున పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధన్‌కర్ బరిలో నిలవగా.. ప్రతిపక్షాల అభ్యర్థిగా కాంగ్రెస్ వెటరన్ లీడర్ మార్గరెట్ అల్వా రంగంలోకి దిగారు. 

ప్రతిపక్షాలకు టీఎంసీ షాక్ ఇచ్చింది. ఇప్పటికే రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ఇచ్చి శివసేన, జేఎంఎం పార్టీలు ప్రతిపక్షాల ఐక్యతకు గండి కొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా, ఉప రాష్ట్రపతి ఎన్నికలో టీఎంసీ ఎవరికీ ఓటేయకుండా పోలింగ్‌కు దూరంగా నిలవనున్నట్టు ఆ పార్టీ తెలిపింది. అందుకు కారణాన్ని కూడా వెల్లడించింది. జగదీప్ ధన్‌కర్ లేదా మార్గరెట్ అల్వాకు మద్దతు ఇవ్వకుండా నిలవడానికి పార్టీ ఏకగ్రీవంగా ఓ నిర్ణయానికి వచ్చిందని మమతా బెనర్జీ అల్లుడు అభిజీత్ బెనర్జీ తెలిపారు.

ఎన్డీయే అభ్యర్థికి మద్దతు అనే ప్రశ్నే తమ ముందు ఉదయించదని ఎంపీ అభిషేక్ బెనర్జీ స్పష్టం చేశారు. తమతో సరైన విధానంలో సంప్రదింపులు జరపకుండానే ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయడాన్ని తాము ఖండిస్తున్నామని వివరించారు.ప పార్లమెంటు ఉభయ సభల్లో 35 మంది ఎంపీలు ఉన్న తమ పార్టీతో చర్చలు జరపకుండానే ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయడం ఆక్షేపణీయం అని అన్నారు. అందుకే ఉప రాష్ట్రపతి ఎన్నికకు తమ పార్టీ దూరంగా ఉంటుందని తెలిపారు.

టీఎంసీ ఎంపీలు ప్రతిపక్ష అభ్యర్థి మార్గరెట్ అల్వాకు మద్దతు తెలపడానికి ఇష్టపడటం లేదని ఆయన వివరించారు. ‘ఒక వైపు ఎన్డీయే అభ్యర్థి జగదీప్ ధన్‌కర్.. మరో వైపు మార్గరెట్ అల్వా. ధన్‌కర్ తీరు తీవ్రమైన పక్షపాతంతో కూడి ఉంది. గత మూడేళ్లుగా బెంగాల్ ప్రజలపై ఆయన దాడి చేస్తూనే ఉన్నారు. కాబట్టి, ఎన్డీయే అభ్యర్థికి మద్దతు తెలిపే ఛాన్సే లేదు. మరో వైపు ప్రతిపక్షాల అభ్యర్థిని తమను సంప్రదించకుండానే ఎంపిక చేశారు. ఓ సీనియర్ నేత మమతా బెనర్జీని వచ్చి కలిశారు. కానీ, అప్పటికే మీటింగ్ ముగిసింది’ అని అన్నారు.

కాగా, టీఎంసీ ప్రతినిధి డెరెక్ ఒబ్రియన్ మాట్లాడుతూ, ‘ప్రతిపక్షాల ఐక్యతనే తాము కోరుకుంటున్నాం. కానీ, పెద్ద అపోజిషన్ పార్టీ, కమ్యూనిస్టులు వారికి ఇష్టమైన పేర్లను ఎంపిక చేస్తే సరిపోదు. మమ్మల్ని లెక్క చేయకుండా వారే నిర్ణయాలు తీసుకోరాదు. మమ్మల్నీ సమానంగా చూడాల్సిందే’ అని చెప్పారు.
 

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !