పుట్టింటికి వచ్చిన చెల్లికి కత్తితో సత్కారం.. ఓ అన్న ఘాతుకం.. చంపి పోలీస్ స్టేషన్ కి వెళ్లి...

By AN TeluguFirst Published Oct 28, 2021, 12:47 PM IST
Highlights

రక్తం పంచుకుని పుట్టిన చెల్లెలిని హతమార్చిన అన్న పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. జిల్లాలోని నవలగుంద పట్టణంలోని కల్మేశ్వర గుడి ప్రాంతంలో మహంతేష్ శరణప్ప నవర అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఈయన చెల్లెలు శశికళ సుణగార ఇటీవల పుట్టినింటికి వచ్చింది. 

కర్ణాటక : అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన అన్న ఆ చెల్లి పాలిట మృత్యువుగా మారాడు. రాఖీ కట్టించుకుని రక్ష అందిస్తాడనుకున్న అన్న ఆ చెల్లిని పాశవికంగా కత్తితో పొడిచి హతమార్చాడు. చిన్ని వాగ్వాదం ఆ కుటుంబంలో చిచ్చు పెట్టింది. అన్నాచెల్లెళ్ల బంధాన్ని రక్తసిక్తం చేసింది. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. 

రక్తం పంచుకుని పుట్టిన చెల్లెలిని హతమార్చిన అన్న పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. జిల్లాలోని నవలగుంద పట్టణంలోని కల్మేశ్వర గుడి ప్రాంతంలో మహంతేష్ శరణప్ప నవర అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఈయన చెల్లెలు శశికళ సుణగార ఇటీవల పుట్టినింటికి వచ్చింది. 

వచ్చినప్పుడు ఇద్దరూ బాగానే ఉన్నారు. అయితే ఆ తరువాతే ఇద్దరి మధ్య గొడవ మొదలయ్యింది. ఏదో విషయం మీద మంగళవారం సాయంత్రం అన్నా చెల్లెళ్ల మధ్య Conflict చోటు చేసుకుంది. క్షణికావేశంతో మహంతేష్ తన Younger sisterని కత్తితో పొడిచి Murder చేశాడు. అనంతరం కత్తితో పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి శశికళ deadbodyని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. 

అయితే వీరిద్దరి మధ్య గొడవ అప్పటికప్పుడు చోటు చేసుకుంది. అంతకు ముందు నుంచి ఉన్న గొడవలు ఈ దారుణానికి దారి తీశాయా అనే విషయాలు తెలియాల్సి ఉంది. 

21 ఏళ్ల యువతిపై 15 ఏళ్ల బాలుడు అత్యాచారయత్నం.. పొలాల్లోకి లాక్కెళ్లి, రాళ్లతో కొట్టి...

ఒంటరితనంతో విసిగిపోయి...
ఇదిలా ఉండగా, ఢిల్లీ యూనివర్శిటీ విశ్రాంత ప్రొఫెసర్ దంపతులు.. బలవన్మరణానికి పాల్పడ్డారు. గత కొంతకాలంగా  అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు.. మంచానికే పరిమితం అయ్యారు. 

ఈ క్రమంలో.. ఇలాంటి జీవితం అవసరమా అని భావించిన ఆ దంపతులు బలవనర్మణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఆగ్నేయ ఢిల్లీలోని గోవింధపురి ప్రాంతంలోని  కల్కాజీ ఎక్స్ టెన్షన్ లోని నివాసం ఉంటున్న రాకేష్ కుమార్ జైన్(74), అతని భార్య ఉషా రాకేష్ కుమార్ జైన్ (69) లు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. వారు Suicide చేసుకున్న ప్రాంతంలో రెండు సూసైడ్ నోట్లు కనపడినట్లు పోలీసులు  చెప్పారు. 

భారత్‌లో కొత్తగా 16,156 కరోనా కేసులు .. 3.42 కోట్లకు చేరిన మొత్తం సంఖ్య

దానిలో వారు.. తాము మంచానికే పరిమితమైపోయామని.. అలాంటి బతుకు అవసరం లేదని అనిపించిందని.. అందుకే విసిగిపోయి.. ఈ నిర్ణయం తీసుకున్నామని వారు అందులో పేర్కొనడం గమనార్హం. వారు ఆత్మహత్య చేసుకున్నారంటూ.. గోవింద్ పేరి పోలీస్ స్టేలషన్ కు మధ్యాహ్నం 3గంటల 45 నిమిషాల సమయంలో ఫోన్ వచ్చింది. 

వారి కుమార్తె స్వయంగా పోలీసులకు ఫోన్ చేయడం గమనార్హం. తమ తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారని వారు అందులో పేర్కొన్నారు. ఈ ప్రొఫెసర్ కుమార్తె అంకిత(47) వేరే ప్రాంతంలో ఉంటుంది. అయితే.. తల్లిదండ్రులను చూసుకోవడానికి మాత్రం  అజిత్ అనే కేర్ టేకర్ నియమించింది. 

బుధవారం మధ్యాహ్నం కేర్ టేకర్ వచ్చి.. ఎన్నిసార్లు కాలింగ్ బెల్ కొట్టినా.. వారు స్పందించలేదు. దీంతో వెంటనే అంకిత కు సమాచారం అందించారు. ఆమె వచ్చి ఇంటి తలుపులు పగలకొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. తీరా.. లోపలికి వెళ్లే సరికి.. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ ఉరికి వేలాడుతూ కనిపించడం గమనార్హం. 

click me!