దారుణం.. సోదరిని, ఆమె ప్రియుడిని కొట్టి.. గొంతుకోసం.. రక్తమోడుతున్న కత్తితో పోలీస్ స్టేషన్ కు...

Published : Nov 07, 2022, 11:04 AM IST
దారుణం.. సోదరిని, ఆమె ప్రియుడిని కొట్టి.. గొంతుకోసం.. రక్తమోడుతున్న కత్తితో పోలీస్ స్టేషన్ కు...

సారాంశం

వేరే కులం వ్యక్తిని ప్రేమించిందని సొంత సోదరిని, ఆమె ప్రియుడిని అతి దారుణంగా చంపేశాడో వ్యక్తి. ఆ తరువాత రక్తం ఒడుతున్న కత్తితో పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. 

ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్ లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన జరిగింది. ఆదివారం ఉదయం రక్తంతో తడిచిన కత్తితో ఓ యువకుడు నేరుగా ఫరూఖాబాద్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాడు. చేతిలో కత్తితో వచ్చిన యువకుడిని చూసిన పోలీసులు మొదట షాక్ అయ్యారు. ఏం జరిగిందని  ఆరా తీశారు. తన సోదరిని, ఆమె ప్రియుడిని కత్తితో నరికివేసి నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చానని ఆ యువకుడు చెప్పడంతో నివ్వెరపోయారు. వెంటనే అతడిని అరెస్టు చేసి, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.  

ఉత్తరప్రదేశ్లోని ఫరూఖాబాద్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఫరూఖాబాద్ సమీపంలోని రాజేపూర్ సరైమెడ అనే గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలిక పొరుగున ఉండే రామ్ కరణ్ జాతవ్ (25) అనే వ్యక్తి ప్రేమలో పడింది. తరచుగా అతడిని కలుస్తుండేది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు ఆమెను హెచ్చరించారు. అంతేకాదు కులాంతర వివాహానికి తాము అంగీకరించబోమని తేల్చి చెప్పారు. శనివారం రాత్రి 10 గంటలకు ఆ బాలిక ఇంటి నుంచి అదృశ్యం అయింది.  

రాత్రి తులసిపూజ వీడియోలు షేర్ చేసి.. ఉదయాన్నే నవవధువు ఆత్మహత్య..

దీంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. ఊరంతా వెతికారు. చుట్టుపక్కల అంతా వెతికినా బాలిక, ఆమె ప్రియుడు ఆచూకీ దొరకలేదు. చివరికి బాలిక ప్రియుడు కరణ్ ఇంటికి వెళ్లి వెతికారు. అతను కూడా మాయమయ్యాడన్న విషయం అర్థమయ్యింది. దీంతో బాలిక సోదరుడు నీతూ  ఇద్దరి కోసం వెతకడం ప్రారంభించాడు. చివరికి రాత్రి 2 గంటల ప్రాంతంలో నీతూ ఇద్దరినీ వెతికి పట్టుకున్నాడు. ఆ తర్వాత వారిని తీవ్రంగా కొట్టాడు. తీవ్ర గాయాలు కావడంతో ఇద్దరూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. 

అక్కడితో ఆగకుండా.. అపస్మారక స్థితిలో ఉన్న ప్రేమికులు ఇద్దరి గొంతులు కోసి డ్రెయిన్ లో పడేశాడు. ఆ తరువాతి రోజు ఉదయం 6 గంటలకు నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లిన నిందితుడు విషయం చెప్పి లొంగిపోయాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పొదిల్లోంచి నుంచి ఇద్దరు మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టంకు తరలించారు. నిందితుడిని రిమాండ్ కు తరలించారు.

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu