రాత్రి తులసిపూజ వీడియోలు షేర్ చేసి.. ఉదయాన్నే నవవధువు ఆత్మహత్య..

Published : Nov 07, 2022, 10:36 AM IST
రాత్రి తులసిపూజ వీడియోలు షేర్ చేసి.. ఉదయాన్నే నవవధువు ఆత్మహత్య..

సారాంశం

పెళ్లైన ఐదు నెలలకే నవవధువు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. రాత్రిపూట తులసి పూజ చేసి ఆ వీడియోలో సోషల్ మీడియాలో షేర్ కూడా చేసింది. 

కర్ణాటక : వివాహమైన ఐదు నెలలకే నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. శివమొగ్గ నగరం అశ్వత నగరలోని 5క్రాస్ లో ఈ ఘటన జరిగింది.  మృతురాలిని నవ్యశ్రీ (23)గా గుర్తించారు. నవ్యశ్రీకి ఐదు నెలల క్రితమే ఆకాశ్ అనే యువకుడితో పెళ్లయింది. శనివారం సాయంత్రం ఇంటిదగ్గర తులసి పూజ చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేసింది. అయితే, ఆదివారం ఉదయం ఏడు గంటల సమయంలో కారు షెడ్ లో ఉరి వేసుకున్న స్థితిలో కనిపించింది. 

కాగా, ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కుటుంబ సమస్యల కారణంగానే నవ్యశ్రీ ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని నవ్య శ్రీ కుటుంబీకులు అనుమానిస్తున్నారు. దీంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వినోబానగర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

కాగా, ఇలాంటి ఘటనే ఈ జూన్ లో కృష్ణాజిల్లాలో చోటు చేసుకుంది. పెళ్లయిన 4 నెలలకే ఆమెకు నూరేళ్లు నిండాయి. సెల్ ఫోన్ కారణంగా జరిగిన గొడవ కొత్తగా పెళ్లైన వధువు ప్రాణాలు బలితీసుకుంది. కలుపు మందు తాగి చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలం భద్రిరాజుపాలెంలో జరిగిన ఈ ఘటన ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  

ఇంట్లో తెలుగు మాట్లాడతారు.. బయట తమిళులుగా చెలామణీ అవుతారు.. అందుకే నా తీరు నచ్చడం లేదు.. తమిళిసై

భద్రిరాజుపాలెం గ్రామానికి చెందిన వల్లూరు యోహాను, మరియమ్మ దంపతుల చిన్న కుమార్తె రత్నకుమారి (19)ను ఉంగుటూరు మండలం నందమూరు గ్రామానికి చెందిన పేటేటి సన్నీకి ఇచ్చి ఈ ఏడాది ఫిబ్రవరి 18న వివాహం చేశారు. సన్నీ వ్యవసాయ పనుల రీత్యా భద్రిరాజుపాలెంలోని అత్తగారి ఇంట్లోనే ఉంటున్నాడు. జూన్ నెల 13న సెల్ఫోన్ కారణంగా రత్నకుమారితో చిన్న గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన రత్నకుమారి ఇంటి ఆవరణలో ఉన్న కలుపు మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.  

అక్కడ చికిత్స పొందుతూ రెండవ రోజు ఉదయం  మృతి చెందింది. రత్నకుమారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పెళ్లై నాలుగు నెలలు కూడా నిండకముందే మృతిచెందడంతో ఇరు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. రత్నకుమారి ఇటీవల ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు కూడా రాసినట్లు తెలిసింది. మృతురాలి తండ్రి యోహాను ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అర్జున్ తెలియజేశారు. 

PREV
click me!

Recommended Stories

Jagannath Puri Rath Yatra 2026: కదలనున్న జగన్నాథ రథ చక్రాలు | Lord Jagannath Darshan
Indian Population in USA: అమెరికాలో ఇండియన్స్ అడ్డా.. ఈ 5 నగరాల్లోనే ఎక్కువ మంది.. ఎందుకో తెలుసా?