ఇంట్లో తెలుగు మాట్లాడతారు.. బయట తమిళులుగా చెలామణీ అవుతారు.. అందుకే నా తీరు నచ్చడం లేదు.. తమిళిసై

By SumaBala BukkaFirst Published Nov 7, 2022, 8:05 AM IST
Highlights

తమిళనాడుపై అభిప్రాయాలు వ్యక్తం చేయవద్దని చెప్పేందుకు వారు ఎవరు అంటూ విరుచుకుపడ్డారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్. తెలుగు మూలాలున్న వారికే తన వైఖరి నచ్చడం లేదని విమర్శించారు.

తమిళనాడు : ఇంట్లో తెలుగు మూలాలు ఉండి…ఇంట్లో ఆ భాష మాట్లాడుతూ. బయట తమిళ వేషం వేసేవారు తనలా నిజమైన తమిళ రక్తం ప్రవహించే వారి వైఖరిని జీర్ణించుకోలేకపోతున్నారని తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి ఇంచార్జ్  లెఫ్టినెంట్ గవర్నర్  తమిళిసై వ్యాఖ్యానించారు. తమిళనాడుపై అభిప్రాయాలు వ్యక్తం చేయవద్దని చెప్పేందుకు వారు ఎవరు అని ప్రశ్నించారు. కొందరికి మైక్ మేనియా ఉందని,  తెలంగాణలో గొప్పలు చెప్పేందుకు వీలు కాక తమిళనాడును విమర్శిస్తున్నారంటూ.. తమిళిసైని ఉద్దేశించి వ్యాఖ్యానిస్తూ డీఎంకే అధికారిక పత్రిక ‘మురసొలి’లో ఓ వ్యాసం ప్రచురితమైంది.  

దీనికి స్పందిస్తూ  తమిళిసై తాజాగా విడుదల చేశారు. ‘డీఎంకే తనను అగ్నిపర్వతం అని చెప్పుకుంటోంది. కానీ అది హిమాలయాలను ఏమీ చేయలేదు. ఏం చూసినా భయపడే వాళ్ళే గవర్నర్లను విమర్శిస్తున్నారు. సీరియళ్లు, సినిమాల్లో నటించి పదవిలోకి వచ్చిన వారికే కెమెరా, మైక్ మేనియాలు ఉంటాయి. నిజాలు మాట్లాడే మాకు ఉండవు. వారికి మైక్ మేనియా అనే అంటే మోదీ ఫోబియా ఎక్కువగా ఉంది’  అని విమర్శించారు. 

వ్యాపారికి మత్తుమందిచ్చి కోట్ల విలువైన నగదు, నగలు ఛోరీ.. పనిమనుషుల ఘాతుకం..

తెలంగాణలో ఏం జరుగుతుందో తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. తెలంగాణ పత్రికల్లో వచ్చే వార్తలు చూస్తే ఎవరు వణుకుతున్నారో అర్థం అవుతుందని పేర్కొన్నారు. తమిళనాడులో వారసత్వ రాజకీయ ప్రభుత్వాన్ని ప్రజల ముందు నిలదీస్తున్నందుకే గవర్నర్ రవిపై అధికార పార్టీ నేతలకు కోపం అని పేర్కొన్నారు. తమిళనాడు, పుదుచ్చేరిలలో పనిచేస్తూ మార్గమధ్యలో ఒకటి, రెండు కార్యక్రమాల్లో పాల్గొనే తనను విమర్శించే పని పెట్టుకోవద్దని తమిలిసై హితవు పలికారు. 

ఇదిలా ఉండగా, గత నెలలో కూడా తెలంగాణ మీద ఇలాంటి కామెంట్సే చేశారు తమిళిసై. సాధారణ జీవితం గడపడమే తన నైజమని, తెలంగాణ రాజ్ భవన్ లో తనకు అయ్యే ఖర్చును నెలనెలా తానే  చెల్లిస్తున్నానని తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. తెలంగాణ గవర్నర్ గా మూడేళ్లపాటు అందించిన సేవలు తనకు ఎదురైన అనుభవాలతో తమిళిసై రాసిన ‘రీ డిస్కవరింగ్ సెల్ప్ ఇన్ సెల్ఫ్ లెస్ సర్వీస్’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం గురువారం చెన్నైలో జరిగింది. ఈ పుస్తకాన్ని స్వయంగా ఆవిష్కరించిన తమిళిసై…సీనియర్ పాత్రికేయులు నక్కీరన్ గోపాల్, కృష్ణన్ తదితరులకు తొలి ప్రతిని అందించారు.  

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  గవర్నర్ హోదాలో ప్రత్యేక హెలికాప్టర్, ప్రత్యేక విమానం సేవలు పొందే అధికారం ఉన్నా..  తాను ఎప్పుడూ  వాటిని వినియోగించలేదని అన్నారు.  తెలంగాణలో తాను ఎలాంటి రాజకీయాలు చేయడం లేదని రాజ్యాంగ సంరక్షకురాలిగా తన బాధ్యతలను మాత్రం నెరవేరుస్తానని తెలిపారు. కానీ కొందరు తమ పనులకు ఆటంకం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎవరు వ్యతిరేకించినా  తాను చేయదలచుకున్న పని ఆగదని స్పష్టం చేశారు.

తనకు ప్రజాశేయస్సే ముఖ్యమని,  ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తానని పేర్కొంటూ భద్రాచలంలో జరిగిన ఉదంతాన్ని గుర్తుచేసుకున్నారు వరదల సమయంలో ప్రజలను ఆదుకునేందుకు భద్రాచలం వెళుతున్నానని మీడియా ద్వారా తెలుసుకుని.. అప్పటివరకు ఏ మాత్రం పట్టించుకోకుండా బంగ్లాలో ఉన్న ముఖ్యమంత్రి హడావుడిగా బాధిత ప్రాంతాలకు బయలుదేరారని అన్నారు. తాను ఏ పదవిలో ఉన్నా.. ఎక్కడున్నా.. ప్రజలతో మమేకం అవడమే తనకు ఇష్టమని వారి కష్టసుఖాలు పంచుకుంటూ సాధారణ మహిళగానే జీవిస్తానని చెప్పారు. తనకు చేతనైన సేవ చేస్తున్నానని దీనిని ఎవరూ అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు.

click me!